https://oktelugu.com/

Rahul Gandhi : గట్టి ప్రతిపక్షంగా వుండమని ఓటేస్తే అధికారం కోసం తాపత్రయమా?

గట్టి ప్రతిపక్షంగా వుండమని ఓటేస్తే అధికారం కోసం తాపత్రయ పడుతున్న ‘కాంగ్రెస్’ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2024 / 06:34 PM IST

    Rahul Gandhi : రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదేదో మాట్లాడాడు. ప్రజల తీర్పు చూస్తే కాంగ్రెస్ గట్టి ప్రతిపక్షంగా ఉండమని తీర్పునిచ్చింది. 99 సీట్లు అంటే.. గట్టి ప్రతిపక్షంగా ఉండాలని కాంగ్రెస్ కు గౌరవం ఇచ్చారు. ఆ వచ్చిన 99 సీట్లలో కూడా ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలతో వచ్చినవే ఎక్కువగా ఉన్నాయి.

    తమిళనాడులో కాంగ్రెస్ కు 9 సీట్లు వచ్చాయి. డీఎంకే పుణ్యమాని అన్ని సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. యూపీలో 6 ఎంపీ సీట్లు వచ్చాయి. అక్కడ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు వల్ల ఇది సాధ్యమైంది. బీహార్ లో ఆర్జీడీ పుణ్యమానికి 3 సీట్లు వచ్చాయి. జార్ఞండ్ లో 2 సీట్లు వచ్చాయి. జేఎంఎం పుణ్యమాని వచ్చాయి.

    99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇంత ఓవరాక్షన్ అవసరమా? రాజ్యాంగాన్ని రక్షించటమే తన బాధ్యత అని రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో చెబుతాడు.

    గట్టి ప్రతిపక్షంగా వుండమని ఓటేస్తే అధికారం కోసం తాపత్రయ పడుతున్న ‘కాంగ్రెస్’ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.