BJP in Kerala : రెండు రోజుల్లో కేరళ ఎన్నికలు జరుగబోతున్నాయి. బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది. ఈరోజు ఆసక్తి యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మీద లేదు. బీజేపీ ఖాతా తెరుస్తుందా? లేదా? ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభావంపైనే అందరూ మాట్లాడుతున్నారు. మేం బీజేపీని ఇక్కడ ఖాతా తెరవనివ్వం అంటూ యూడీఎఫ్, ఎల్డీఎఫ్ సవాల్ చేస్తున్నాయి.
ఒకటి మాత్రం నిజం.. బీజేపీకి సీట్ల సంఖ్య పక్కన పెడితే.. ఎన్డీఏకు గణనీయంగా పడబోతున్నాయి. బీజేపీ కూటమికి 20 శాతం వరకూ ఓట్లు పడే అవకాశం మాత్రం కనిపిస్తోంది. ఇది మాత్రం నిజం. గెలవడం అన్నది పక్కనపెడితే దక్షిణ కేరళ, మధ్య తెలంగాణలో ముక్కోణపు పోటీ జరుగబోతోంది.
ఇప్పుడు సీట్లు ఏం గెలుస్తారన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ఇవ్వాళ బీజేపీ క్రిటికల్ మాస్ స్థాయికి చేరుకుంటుంది. పార్టీ అభ్యర్థిగా గెలవడం కష్టం అని తెలుస్తోంది. అభ్యర్థి స్టామినా తోడైతే గెలిచేందుకు ఆస్కారం ఉంది.
బీజేపీ కేరళలో గెలిచే అవకాశాలు త్రివేంద్రం, త్రిసూర్ లో మాత్రమే కనిపిస్తోంది. బీజేపీ కేరళలో ఖాతా తెరవబోతుందా? లేదా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.