Kerala BJP : బీజేపీకి కేరళలో అదృష్టం తన్నుకొస్తున్నట్టుగా ఉంది. అదివరకు ఎంత కష్టపడినా ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ త్రిసూర్ లోక్ సభ స్థానాన్ని సంపాదించుకోవడంతోపాటు తిరువనంతపురం , అతీంగల్, అల్లపూజలో అద్భుతమైన ప్రజాదరణ సంపాదించింది.
ఇవాళ తిరిగి బీజేపీ రాదు అన్న వారికి ఆ మాట అనే హక్కులేదు. తిరిగి అటువంటి అవకాశం కేరళలో వస్తుందా? అనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు షఫీ పెరంబళ్, రాధాకృష్ణ లు ఎంపీలుగా గెలవడంతో ఈ రెండు అసెంబ్లీ స్థానాలకు తిరిగి ఎన్నికలు జరుగనున్నాయి.
పాలక్కాడ్ అసెంబ్లీకి కేరళలో ఉప ఎన్నిక జరుగబోతోంది. దీని ప్రత్యేకత అల్లా బీజేపీకి బలమైన అసెంబ్లీ స్థానం ఏదైనా ఉందంటే అది ‘పాలక్కాడ్’. ఈ నియోజకవర్గంలో తమిళియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఇది తమిళనాడుకు సరిహద్దుల్లో ఉంటుంది. 82 శాతం అర్బన్ ఓటర్లు ఉన్న నియోజకవర్గం.
బీజేపీకి కేరళలో మరో బంగారు అవకాశం ముందుంది.. అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశాలున్నాయి. దీని మీద ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.