https://oktelugu.com/

AP BJP : సామాజిక కూర్పులో కాపుల్ని, రాజకీయంగా పార్టీ విధేయుల్ని విస్మరించిన ఆంధ్రా బీజేపీ

సామాజిక కూర్పులో కాపుల్ని, రాజకీయంగా పార్టీ విధేయుల్ని విస్మరించిన ఆంధ్రా బీజేపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : March 28, 2024 / 12:30 PM IST

    AP BJP : ఆంధ్రాలో బీజేపీ ఎప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు. తప్పుల మీద తప్పులు చేసుకుంటూనే వెళుతోంది. ఒకనాడు ఒక వ్యూహం ప్రకారం కాపులను పైకి ప్రొజెక్ట్ చేసింది. కాపులకు అధ్యక్ష పీఠం ఇచ్చింది. మొదట కన్నా లక్ష్మీనారాయణ.. తర్వాత సోము వీర్రాజులకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పింది.

    మిగతా రెండు పార్టీలు రెండు సామాజికవర్గాలకు ఆధిపత్యం వహిస్తుండడంతో కాపులను పైకి లేపాలని బీజేపీ చూసింది. సోమువీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో అంతా కమ్మవారి టీడీపీ సామాజికవర్గ ఆధిపత్యమే నడుస్తోంది.

    బీజేపీ తీసుకొచ్చిన ఈ అధ్యక్ష మార్పు తర్వాత బీజేపీ యూటర్న్ తీసుకుందా? అని అనిపిస్తోంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీకి విధేయులుగా ఉన్నవారు ఒక్కరు కూడా బీజేపీ ప్రకటించిన ఎమ్మెల్యే టికెట్ లిస్ట్ లో లేకపోవడం అందరికీ షాకింగ్ మారింది.

    సోము వీర్రాజుకు టికెట్ దక్కలేదు. మాధవ్ , జీవీఎల్ నరసింహరావు, విష్ణువర్ధన్ రెడ్డిలాంటి కీలక నేతలకు టికెట్లు దక్కకపోవడం అందరినీ విస్మయపరిచింది. రాజకీయంగా ఇలా ఉంటే సామాజికపరంగా కూడా టికెట్లు ఇవ్వలేదు. కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.

    సామాజిక కూర్పులో కాపుల్ని, రాజకీయంగా పార్టీ విధేయుల్ని విస్మరించిన ఆంధ్రా బీజేపీ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.