Bihar Elections 2025: బీహార్ లో ఇంకో 4 నెలల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు వాళ్ల ప్రిపరేషన్ లో ఉండిపోయాయి. 2025 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి.. మార్పును కోరుకుంటున్నాయా? ప్రశాంత్ కిషోర్ దాదాపు రెండు సంవత్సరాల పాటు పాదయాత్ర చేశారు. 1990లో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎం అయ్యారు. 2005లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటిదాకా కొనసాగుతన్నారు.
35 సంవత్సరాలు అధికారం ఈ రెండు కుటుంబాల మధ్యే సాగుతోంది. నితీష్, లాలూ కుటుంబాలే పాలిస్తున్నాయి. గత 15 రోజులుగా బీహార్ లో క్రైం రేటు పెరిగిపోతోంది. బీహార్ ప్రజలు చాలా రియాక్ట్ అవుతున్నారు. ఈ సారి నవతరం నాయకులకు ఓటు వేస్తారా? కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్నది చూడాల్సిందే..
గత ఎన్నికల్లో తేజస్వి యాదవ్ కు ఆల్ మోస్ట్ అధికారానికి దగ్గరగా వచ్చి కొద్ది సీట్ల తేడాతో అధికారం కోల్పోయాడు. ఈసారి బీహార్ లో ఎంతో మంది పోటీలో ఉన్నారు.
ఈసారి చిరాగ్ పాశ్వన్ బీహార్ రాజకీయాల్లో ఉంటానని ప్రకటనలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్, చిరాగ్ పాశ్వన్ కలిసిపోతారని అంటున్నారు.
ఇక బీహార్ లో 2023 నుంచి రెండేళ్లుగా పాదయాత్ర చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్లాడు. వ్యూహకర్తగా సక్సెస్ అయిన పీకే ఇప్పుడు రాజకీయాల్లో ఆ వ్యూహాలు అన్నీ అమలు చేస్తూ సీఎం రేసులో ఉన్నారు. ఆయనకు ఓట్లు పడుతాయా? లేదా? అన్నది ఇంకా తేలడం లేదు.
తేజస్వి, చిరాగ్, ప్రశాంత్, సంతోష్ మరి బీజేపీ కి ఎవరు? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.