Shock to BJP ఎగ్జిట్ ఫలితాలకు భిన్నంగా ఈరోజు రియల్ ఫలితాలు వచ్చాయి. ఎవరూ ఊహించలేదు. ఏ ఒక్క సర్వే సంస్థ కూడా ఈ ఫలితాలు ఊహించలేదు. ప్రతీ సర్వే సంస్థ మోడీ, ఎన్డీయేకు 350 సీట్లు వస్తాయని ఇచ్చాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ఆల్ మోస్ట్ 300 కంటే దిగువకే సీట్లు రావడం విశేషం.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎందుకని బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదన్నది అసలు సమస్య. బీజేపీకి సీట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఉత్తరప్రదేశ్. యూపీలో మోడీ-యోగి కాంబినేషన్ అత్యధిక ఫలితాలు సాధిస్తుందని నమ్మారు. అభివృద్ధి చేశారు. కానీ జనం నాడిని పసిగట్టడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి.
యూపీలో బీజేపీకి పోయినసారి కంటే తక్కువ వస్తాయన్న సర్వే సంస్థ లేదు. ఇంత దారుణంగా యూపీలో బీజేపీకి సీట్లు పడిపోతాయని ఎవ్వరూ ఊహించలేదు.
ఎగ్జిట్ ఫలితాలకు భిన్నంగా మోడీకి షాకిచ్చిన రియల్ ఫలితాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.