Baramati Election : ఈరోజు బారామతికి లోక్ సభ ఎన్నిక జరుగబోతోంది. మహారాష్ట్రలో శరద్ పవార్ కు కంచుకోట.. దాదాపు మూడున్నర దశాబ్ధాల నుంచి బారామతిని ఏలుతున్నారు శరద్ పవార్. బారామతి అద్భుతంగా అభివృద్ధి చేశారు శరద్ పవార్. అక్కడ భవనాలు, కార్యాలయాలు, ఇండస్ట్రీలు, కోఆపరేటివ్ సొసైటీలు, 12 షుగర్ ఫ్యాక్టరీలు పెట్టి అభివృద్ధి చేశారు.
శరద్ పవార్ చేసిన అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతలు గుణపాఠం నేర్చుకోవాలి. సోనియా, రాహుల్ సహా నెహ్రూ వరకూ బుద్దితెచ్చుకోవాలి. మహారాష్ట్రలో మిగతా ప్రాంతం వెనుకబడినా బారామతి అభివృద్ధి చెందింది.
శరద్ పవార్ వర్సెస్ మేనల్లుడు అజిత్ పవార్ మధ్య తగాదా వచ్చింది. ఇద్దరూ విడిపోయి పోటీచేస్తున్నారు. శరద్ పవార్ కూతురు సుప్రీయా సులే, అజిత్ పవార్ భార్య సుమేత్ర పవార్ లు విడివిడిగా పోటీచేస్తున్నారు. మరి బారామతి లో ఈరోజు జరిగే ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు. ఎవరిని ప్రజలు గెలిపించబోతున్నారన్నది ఆసక్తి రేపుతోంది.
బారామతి లోక్ సభలో 6 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 2 ఎన్సీపీ గెలిచింది. 2 బీజేపీ గెలిచింది. మిగతా 2 కాంగ్రెస్ గెలిచింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకం కాబోతున్న బారామతిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.