https://oktelugu.com/

Sheikh Hasina : భారత్ అనుకూల హసీనా గద్దె దిగితే సంతోషంలో మన దేశ ప్రతిపక్షాలు

రాజకీయాలు పక్కనపెడితే షేక్ హసీనా లాంటి మంచి మిత్రురాలు దిగిపోవడం మాత్రం అందరికీ షాకింగ్ పరిణామమే.. భారత్ అనుకూల హసీనా గద్దె దిగితే సంతోషంలో మన దేశ ప్రతిపక్షాలు

Written By:
  • NARESH
  • , Updated On : August 6, 2024 6:07 pm

    Sheikh Hasina : బంగ్లాదేశ్ పరిణామాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆ దేశపు అంతరంగిక వ్యవహారాల్లో గురించి మనం మాట్లాడడం లేదు. భారత్ కు చాలామంచి మిత్ర దేశంగా బంగ్లాదేశ్ మెలగడానికి కారకులైన షేక్ హసీనా పదవీచిత్యురాలు కావడం నిజంగా భారత్ కు మైనస్ గానే చెప్పొచ్చు.

    ఇప్పటికే పాకిస్తాన్ మనకు శత్రు దేశం.. చైనా శత్రుదేశం.. తూర్పున బంగ్లాదేశ్ మాత్రమే మనతో గొడవలు లేకుండా మిత్ర దేశంగా ఉంటోంది. భారత్ తో మంచి సంబంధాలు నెరుపుతోంది. షేక్ హసీనా టైంలో మైనార్టీలైన హిందువుల హక్కులు కాపాడబడ్డాయి. ఉగ్రవాదులను ఏరిపారేయడంలో భారత్ -బంగ్లాదేశ్ కలిసి పోరాటం చేశాయి. బంగ్లాదేశ్-భారత్ సైన్యం కలిసి ఆపరేషన్లు నిర్వహించారు.

    1971కి ముందు ఉగ్రవాదులకు నాటి తూర్పు పాకిస్తాన్ అడ్డాగా ఉండేది. ఈశాన్య భారతాన్ని అల్లకల్లోలం చేసేది. ముజిబుర్ రెహ్మన్ నుంచి హసీనా వరకూ ఉగ్రవాదులను ఏరిపారేశారు. భారత్ తో సహకరించారు.

    భారత్ కు అత్యంత మిత్రురాలైన షేక్ హసీనా పదవీచిత్యురాలు కావడం భారత్ కు పెద్ద దెబ్బగా మారాయి. గత 10 ఏళ్లలో మోడీతో కలిసి ఆర్థికాభివృద్ధిని బంగ్లాదేశ్ లో బాగా చేశారు. జీడీపీని పెంచారు. జమాతే ఇస్తాం లాంటి పాకిస్తాన్ అనుకూల సంస్థను షేక్ హసీనా నిషేధించారు. అదే జమాతే సంస్థ పేరు మార్చుకొని విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.

    రాజకీయాలు పక్కనపెడితే షేక్ హసీనా లాంటి మంచి మిత్రురాలు దిగిపోవడం మాత్రం అందరికీ షాకింగ్ పరిణామమే.. భారత్ అనుకూల హసీనా గద్దె దిగితే సంతోషంలో మన దేశ ప్రతిపక్షాలు

    భారత్ అనుకూల హసీనా గద్దె దిగితే సంతోషంలో మన దేశ ప్రతిపక్షాలు || Bangladesh PM Sheikh Hasina resigns