Assam CM Himanta Biswa Sarma: అస్సాం.. ఆల్ మోస్ట్ మినీ భారత్.. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల వారు మిళితమై ఉంటారు. ప్రముఖ ఆదావాసీ ప్రాంతాలు ఉన్నాయి. మూడు జిల్లాలు ఆదివాసీలే.. బ్రహ్మపుత్ర బెల్ట్ లో అస్సామీలున్నారు. కిందికొస్తే బెంగాళీ వారు ఉన్నారు. నేపాలీ, బెంగాళీ, హిందీ, అస్సామీ సహా అన్ని భాషలు మాట్లాడేవాళ్లు ఉన్నారు.
ఇవాళ సమస్య ఏంటంటే.. అటువంటి అస్సాం.. అహోం సంస్కృతిని వారు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈశాన్య భారతంలోకి ప్రవేశించడానికి మొఘలాయాలు ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ అస్సామీలు దాన్ని తిప్పి కొట్టారు. లిచిత్ బపుర్ లెజండరీ అస్సాం సైన్యాధికారి తిప్పి కొట్టి మొఘలాయలను దెబ్బకొట్టారు. కానీ అస్సామీ పాలకుల వల్ల ఇప్పుడు ఆ రాష్ట్రంలో వలస వాదుల వల్ల అస్సామీలే తక్కువైపోయారు.
బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి వలసదారులు ఎక్కువైపోయారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాలకులు వారికి ఆశ్రయమివ్వడంతో వారి సంఖ్య పెరిగింది. దీనికి వ్యతిరేకంగా అస్సామీలు ఆందోళనలు చేసినా తగ్గలేదు. అస్సామీలు ఆ రాష్ట్రంలో ఇప్పుడు మైనార్టీలు అయ్యారు.
మన కళ్ళ ముందే అంతర్ధానమవుతున్న అస్సాం అస్తిత్వం పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.