Asim Munir gets all powers: పాకిస్తాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. సంక్షోభంలో ఉన్నప్పుడు ఇది సహజం. సంక్షోభం ఎన్నో డిస్పరేట్ యాక్షన్స్ కు దారితీస్తుంది. ఖైబర్ ఫంక్తున్వా, బెలూచిస్తాన్ లో జరుగుతున్న ఆందోళనలు పాకిస్తాన్ కు నిద్రలేకుండా చేస్తున్నాయి. దానికి తోడైంది టీఎల్పీ పంజాబ్ ప్రావిన్స్ లో ఆందోళనలకు ఎగదోస్తోంది. దీంతో పాక్ పాలక వర్గాలకు నిద్రలేని రాత్రులు మిగుల్చుతున్నాయి.
ఈ క్రమంలోనే 27వ రాజ్యాంగ సవరణను పాకిస్తాన్ చేపట్టింది. ఏంటి దీని తాత్పర్యం ఏంటంటే.. మిలటరీకి అధికారాలు కట్టబెట్టడం.. న్యాయవ్యవస్థ కత్తిరించడం.. రాష్ట్రాల అధికారాలు కట్ చేసి కేంద్రానికి అధికారం దాఖలు చేయడం. ఈ మూడింటి మీదనే ఈ రాజ్యాంగ సవరణ ఉండనుంది.
ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు ‘ఫీల్డ్ మార్షల్’ పదవి ఇచ్చారు. అయినా మునీర్ కు సంతృప్తి కలగడం లేదు. మిలటరీ ట్రాన్స్ ఫర్లను ప్రెసిడెంట్ కు దాఖలు చేయడం ఏంటని.. తాను ప్రెసిడెంట్ కింద పనిచేయడం ఏంటని మునీర్ భావించారు.
ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ కు అధికారాలు తగ్గించి ఫీల్డ్ మార్షల్ కే సర్వసత్తాక సైనిక శక్తి రాజ్యాంగంగా మారుస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వం నామమాత్రంగా చేయనున్నారు. న్యాయవ్యవస్థను డమ్మీని చేసే ప్రయత్నం చేసేవారు.
పాకిస్తాన్ లో రాజ్యాంగ సవరణతో అసిమ్ మునీర్ కి సర్వాధికారాలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోతో చూడొచ్చు.
