Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్.. ఎక్కడి నుంచి ఎక్కడికి పతనం అయ్యాడో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. లిక్కర్ స్కాం అనుకుంటే ఇప్పుడు జరిగింది చూస్తే అంతకంటే దారుణంగా ఉంది. తన సొంత మహిళా ఎంపీపై వ్యక్తిగత కార్యదర్శి చేత దాడి చేయించాడు. అదీ ఎక్కడో కాదు.. కేజ్రీవాల్ సొంత ఇంట్లో ఈ దాడి జరగడం దారుణంగా చెప్పొచ్చు.
అరవింద్ కేజ్రీవాల్ చర్యలు వింటేనే ఆశ్చర్యంగా ఉంది. ఒక మహిళా ఎంపీకే రక్షణ లేకపోతే ఇక ఎవరికి ఉంటుంది. మహిళా ఎంపీపై దాడి జరిగితే అరవింద్ కేజ్రీవాలే మొదట పోలీస్ కంప్లైంట్ చేయాలి. కానీ ఆయన వ్యక్తిగత కార్యదర్శినే ఈ దాడి చేయడంతో మిన్నకుండి పోయి పెద్ద తప్పు చేశాడు.
స్వాతి మలివా అనే ఆప్ మహిళా ఎంపీపై కేజ్రీవాల్ కార్యదర్శి దాడి దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ స్వాతి మలివా 2015కంటే ముందే పరివర్తన్ అనే ఎన్జీవో స్థాపకుల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతోపాటు స్వాతి మలివా కూడా ఎంతో ముఖ్యురాలు. ఇండియా అగైనెస్ట్ కరప్షన్ అనే ఉద్యమంలో కూడా స్వాతి సభ్యురాలు. 2015 నుంచి ఆప్ ప్రభుత్వంలో ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్ పర్సన్ గా కొనసాగింది. 2020లో రాజ్యసభ తరుఫున ఆప్ ఎంపీగా ఎన్నికైంది. స్వాతి చరిత్ర ఇదీ
మహిళల హక్కుల కోసం ఎంతో పోరాడారు. ఎన్నో కేసుల పాలయ్యారు. ఢిల్లీ మహిళలకు బాసటగా నిలిచారు. ఎన్నో మహిళలపై అత్యాచారాలు బయటపెట్టారు. ఆవిడ చేసిన తప్పు ఏంటి? ఎందుకిలా జరిగిందని ఆరాతీస్తే..
అరవింద్ కేజ్రీవాల్ నైతిక పతనం మరింత దిగజారిందని అర్థమవుతోంది.. ఈ పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.