https://oktelugu.com/

Salman Khurshid: మిలటరీ తిరుగుబాటుని ప్రోత్సహించటం దేశద్రోహ నేరం

మిలటరీ తిరుగుబాటుని ప్రోత్సహించటం దేశద్రోహ నేరం.. కాంగ్రెస్ నేతల మాటల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : August 8, 2024 / 07:07 PM IST

    భావ స్వేచ్ఛ పేరుతో ఏదైనా మాట్లాడవచ్చా? దేశంలో బనానా రిపబ్లిక్ గా అయిపోతోంది. ఎవరు ఏం మాట్లాడుతారో తెలియదు.. మణిశంకర్ అయ్యర్ ఏకంగా ప్రధానిని పట్టుకొని ‘నీచ్’ అని సంభోదించాడు. అది భావ స్వేచ్ఛగా మారింది. సోనియాగాంధీ కూడా ‘హంతకుడు’ అని మోడీని తిట్టిపోసింది. శామ్ పిట్రోడ్ అయితే దారుణంగా మాట్లాడుతున్నాడు. కొంతమంది మౌలాలీలు అయితే మోడీ తల పట్టుకొని తీసుకొస్తే రివార్డ్ లు ఇస్తామంటున్నారు. ఇదేం భావ స్వేచ్ఛ.. మోడీని విమర్శిస్తూ దేశంలో దారుణంగా మాట్లాడుతున్నారు.

    నిన్నటికి నిన్న బంగ్లాదేశ్ పరిస్థితులపై సల్మాన్ ఖుర్షీద్ దారుణ కామెంట్స్ చేశాడు. బంగ్లాదేశ్ లో జరిగింది ఇండియాలో కూడా జరుగుతుందని ఆరోపించాడు. దేశంలో మోడీ దిగిపోవడం ఖాయమంటున్నాడు. ప్రధాని మోడీ నివాసంలోకి వెళ్లి బద్దలు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు.

    ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి మిలటరీ టేకోవర్ చేయాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇంతకంటే దేశద్రోహం ఉంటుందా? సామాన్యులు ఇలా మాట్లాడితే కొత్త చట్టం కింద జైలుకు పంపేవారు. సల్మాన్ ఖుర్షీద్ కు ఏ రైట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. విలేకరులు దీనిపై ప్రశ్నిస్తే ఎక్కడా పశ్చాత్తాపం లేదు.

    టీవీ చర్చల్లో ఈ మాటలు దేశం ద్రోహం కాదా? అని కూడా ఎవరూ లేవనెత్తడం లేదు. బీజేపీ ప్రతినిధులు కూడా నోరెత్తకపోవడం విస్మయం కలిగిస్తోంది.

    మిలటరీ తిరుగుబాటుని ప్రోత్సహించటం దేశద్రోహ నేరం.. కాంగ్రెస్ నేతల మాటల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.