https://oktelugu.com/

Revanth Reddy : రేవంత్ రెడ్డిపై భ్రమలు మెల్లి మెల్లిగా తొలగిపోతున్నాయా?

రేవంత్ రెడ్డిపై భ్రమలు మెల్లి మెల్లిగా తొలగిపోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 21, 2024 / 11:55 AM IST

    Revanth Reddy : రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడు. కలల ప్రపంచాన్ని చూపించడంలో ఆరితేరిపోయాడు. రేవంత్ రెడ్డి మాట్లాడింది వింటుంటే.. తెలంగాణ ఈ ఐదేళ్లలో సింగపూర్ లాగా మారిపోతుందేమో అని అనిపిస్తుంది. అంతలా భ్రమలు కల్పిస్తున్నారు. మొన్నటికి మొన్న మెట్రో విస్తరణతో హల్ చల్ చేశాడు. మొత్తం నగరమంతా విస్తరిస్తున్నట్టుగా పేపర్లలో ఫోకస్ చేశాడు. మీడియాలో ప్రచారం చేయించాడు.

    అసలు కేంద్రంతో సఖ్యత లేదు.. మోడీ ప్రభుత్వం నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా ఏదో మెట్రోతో రూపురేఖలు మార్చుతున్నట్టుగా రేవంత్ రెడ్డి బాగా ఫోకస్ చేశాడు. ఇదంతా ప్రజలను డైవర్ట్ చేయడానికి .. ఇష్యూలను పక్కదారి పట్టించడానికి అనిపిస్తోంది. ప్రజలు కలల ప్రపంచంలో బతికేలా చేస్తున్నాడు.

    మూసీ రివర్ ఫ్రంట్ ను 1.50లక్షల కోట్లతో బాగు చేయబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరు ఇస్తారు.. ? రేవంత్ రెడ్డి ఏం ఆలోచించకుండా అడ్డగోలు హామీలిచ్చాడు.

    ఇప్పటికీ రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఇవన్నీ పక్కనపెట్టి లక్షన్నర కోట్లతో మూసీ నది ప్రాజెక్ట్ చేపట్టారు. మొదట్లో 40వేల కోట్లు.. ఇప్పుడు లక్షన్నర కోట్లు అంటూ పెంచేశారు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి బ్రదర్ 1000 కోట్ల పెట్టుబడి అంటూ హల్ చల్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. ఉట్టికి ఎగరలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేసినట్టుగా ఉందని అనిపిస్తోంది.

    రేవంత్ రెడ్డిపై భ్రమలు మెల్లి మెల్లిగా తొలగిపోతున్నాయా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.