https://oktelugu.com/

Minority Status : హిందువులు మైనారిటీగా వున్నా రాష్ట్రాల్లో హక్కులు వర్తించవా?

హిందువులు మైనారిటీగా వున్నా రాష్ట్రాల్లో హక్కులు వర్తించవా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2024 5:38 pm

    Minority Status : ఎన్నికల్లో ప్రతీ రాజకీయ పార్టీ అన్ని రకాల అస్త్రాలు వాడుతున్నాయి. అన్ని పార్టీలు ఇందుకు మినహాయింపు లేదు. ఇవాళ అందరూ కూడా మీడియాలో , టీవీల్లో, సోషల్ మీడియాలో ఒకటే హోరెత్తిస్తున్నారు. మోడీ మతవాదాన్ని రెచ్చగొడుతున్నారంటున్నారు.

    బడ్జెట్ లో మైనార్టీలకు 15 శాతం ఇవ్వడాన్ని మోడీ తప్పుపట్టారు. మత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని.. ఓబీసీల రిజర్వేషన్ కట్ చేసి ముస్లింలకు ఇవ్వడాన్ని మోడీ తప్పు పట్టారు.

    ఏ విధంగా మత వాదం.. ఏదీ సెక్యూలర్ వాదం అన్నది తెలుసుకుందాం. 2006లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా మైనార్టీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మత ఆధారిత శాఖ లేనే లేదు. ఎప్పుడూ లేనిది కాంగ్రెస్ ప్రవేశ పెట్టింది. కాంగ్రెస్ నిర్ణయం మతవాదం కాదా? అన్నది ప్రశ్న.. 2006 జూన్ లో పీఎం మన్మోహన్ 15 పాయింట్ ప్రోగ్రాం మైనార్టీలకు అనౌన్స్ చేశారు. 15 శాతం బడ్జెట్ ను మైనార్టీలకు కేటాయించాలని మన్మోహన్ పెట్టడాన్ని మోడీ తప్పు పట్టారు.

    హిందువులు మైనారిటీగా వున్నా రాష్ట్రాల్లో హక్కులు వర్తించవా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    హిందువులు మైనారిటీగా వున్నా రాష్ట్రాల్లో హక్కులు వర్తించవా? || Minority Status in India || Ram Talk