Annamalai : ఒకనాడు వారణాసి, ఆ తర్వాత ఢిల్లీ, ఇప్పుడు కోయంబత్తూర్

ఒకనాడు వారణాసి, ఆ తర్వాత ఢిల్లీ, ఇప్పుడు కోయంబత్తూర్ లో పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 11, 2024 3:46 pm

Annamalai : అన్నామలై ఒక సునామీ.. ఓ ప్రభంజనం.. ఓ ప్రజా ఉద్యమం.. ఇది జనం చెబుతున్న మాట.. 2014లో చూస్తే మోడీ గెలవాలని విదేశాల నుంచి ఎన్నారైలు సెలవులు పెట్టి మరీ వచ్చి ప్రచారం చేశారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి మరీ వచ్చి ప్రచారం చేశారు. వారణాసిలో మోడీ గెలవాలని ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేశారు. అటువంటిదే ఆమ్ ఆద్మీ కోసం ఢిల్లీలో ఇంతకన్నా పెద్ద మోతాదులో వచ్చి ప్రచారం చేశారు. ఆనాడు కేజ్రీవాల్ ను జనం నమ్మారు. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది.

ఈరోజు 2024 కోయంబత్తూరులోనూ అదే ఊపు వచ్చింది. ఇప్పుడు కోయంబత్తూరులో అన్నామలై గెలుపు కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రచారం చేస్తున్నారు. జాబ్ కు రాజీనామా చేసి వచ్చి మరీ అన్నామలై కోసం ప్రచారం చేస్తున్నారు.

నిజాయితీపరులకు, వ్యక్తులు మార్పులకు చిహ్నం అని నమ్ముతారో.. అటువంటి వ్యక్తులకు మద్దతు ఇవ్వడానికి ఏ త్యాగానికైనా ప్రజలు సిద్ధపడుతారు. ఐఐఎం, ఐపీఎస్ పాస్ అయిన వ్యక్తి అన్నామలై. రాజకీయాలను మార్చుతానని వచ్చిన అన్నామలై నిజాయితీకి ప్రజలు కనెక్ట్ అయిపోయారు. పీపుల్ ఫర్ అన్నామలై అనే స్వచ్ఛంద సంస్థ మొదలైందంటే అతిశయోక్తి కాదు. జనంలో ఆ ఉత్సాహం.. ఊపు అలా ఉంది.

ఒకనాడు వారణాసి, ఆ తర్వాత ఢిల్లీ, ఇప్పుడు కోయంబత్తూర్ లో పరిస్థితులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.