ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా మొదలైంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసి, కొత్త జిల్లాల రూపకల్పనపై పరిశీలన ప్రారంభించింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ చానెల్‌లలో అనేక ఊహాగానాలు వచ్చినప్పటికీ, అసలు నిర్ణయం ఇంకా తీసుకోలేదు.
సబ్ కమిటీ ఇప్పటికే భౌగోళిక పరిస్థితులు, జనాభా, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అధ్యయనం మొదలుపెట్టింది. కొన్ని జిల్లాలు కొనసాగుతాయని, మరికొన్ని కలపబడే లేదా కొత్తగా ఏర్పడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పునర్విభజన పూర్తయిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని భావిస్తున్నారు.
ఆంధ్రాలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ఇప్పుడే మొదలయ్యింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
