Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినదానిపై దేశంలోని ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం చేశారు.? సామాన్యుడి ఆవేదననే తనలో భావాలు బయటపెట్టారు. తనలోని నిజమైన విప్లవకారుడిని బయటపెట్టారు. ఉద్యమకారుడి ఆలోచనలు ఆయనలో కనిపించాయి. ప్రజల తరుఫున, మహిళలు అఘాయిత్యాలపై పవన్ మాట్లాడారు. పోలీస్ అధికారులకు వారి బాధ్యతలను పవన్ గుర్తు చేశారు. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులది అని నొక్కి వక్కాణించారు. ఇది జనం తరుఫున వినిపిస్తున్న ఆవేదనగా చెప్పొచ్చు.
పవన్ సామాన్యుల ఆవేదనను కళ్లకు కట్టాడు. హోంమంత్రిగా అనిత బాధ్యతలను గుర్తు చేశాడు. అది తప్పు ఏమాత్రం కాదు. హోంమంత్రి రెగ్యులర్ గా పవన్ కళ్యాణ్ ను వచ్చి కలుస్తుంది.
దీన్ని ఒక అవకాశంగా తీసుకొని ఇద్దరి మధ్య తగాదా పెట్టడానికి ప్రయత్నాలు జరగవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా అన్ని శాఖల బాధ్యతలు పవన్ పై ఉంటాయి.. చంద్రబాబు నిన్న ఒక మంత్రిని మందలించాడు.
పవన్ కళ్యాణ్ లో ఉప ముఖ్యమంత్రి కన్నా ఉద్యమకారుడి రూపమే కానవస్తుంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.