Pawan Kalyan : పవన్ కళ్యాన్ ఢిల్లీ పర్యటనలో పెద్ద హైలెట్ ఏదంటే.. ఇండియా టుడే ఇంటర్వ్యూనే కావడం గమనార్హం. ఆక్షిత నందగోపాల్ అనే ఇండియా టుడే జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూ అతి పెద్దదిగా చెప్పొచ్చు. ఈమె తెలుగు అమ్మాయి కావడం గమనార్హం. రియల్ గా మెచ్యూరిటీగా.. చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాడు.
ఒక్కటి కాదు.. అక్షిత వివాదాస్పద అంశాలను టచ్ చేసింది. అయితే పవన్ చాలా పరిణతితో సమాధానం ఇచ్చాడు. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం ఉంది. నేను హిందువునే అని పవన్ స్పష్టతనిచ్చాడు.
డిబేట్ వేరు.. డీమినింగ్ వేరు అంటూ పవన్ చెప్పిన విధానం ఎంతో బాగుంది. హిందూ మతం విషయంలో చర్చ జరపడం లేదని.. కించపరుస్తున్నారని పవన్ ఆవేదన చెందారు. ఎందుకు కామన్ ఫ్లాట్ ఫామ్ ఉండాలన్న దానిపై పవన్ కళ్యాణ్ కారణాలు చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం బోర్డు కావాలన్నది వివరించారు. ఆలయాలపై కంట్రోల్ విషయంలో కూడా స్పష్టమైన విధానం ఉండాలని చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కల్లా హైలైట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.