దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో ఎన్నికలు ఆసక్తిరేపుతున్నాయి. 48 ఎంపీ సీట్లు, 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రమిదీ. అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఓటు వేయడం లేదు. కానీ ఓవరాల్ ట్రెండ్ తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఖంగుతిన్నది. ఎవ్వరూ ఊహించని విధంగా దెబ్బతిన్నది. కారణం ఏంటి? ప్రధాన కారణం ఉందా? అని ఆలోచిస్తే.. అజిత్ పవార్ ను కూటమిలోకి చేర్చుకోవడం పెద్ద దెబ్బగా మారింది. అజిత్ పవార్ కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసిందే బీజేపీ. సాక్షాత్తూ ప్రధాని మోడీనే అజిత్ పవార్ ను కరప్ట్ మ్యాన్ గా ఫోకస్ చేశాడు. మరి అటువంటి అప్పుడు అదే అజిత్ పవార్ ను ఉప ముఖ్యమంత్రి చేయడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో పెద్ద దెబ్బ పడింది.అదనంగా ఓట్లు రాకపోగా.. బీజేపీకి నష్టం చేకూరింది.
మరాఠా పార్టీలుగా ఉన్న ఎన్సీపీ, శివసేనలను చీల్చింది మోడీ, అమిత్ షా ద్వయం.. మహారాష్ట్ర వర్సెస్ గుజరాతీ ఫీలింగ్ ఎప్పటి నుంచో బాగా ఉండేది. గుజరాతీలు బాంబేలో మెజార్టీ ఉన్నారు. వారి మీద ద్వేషాన్ని రెచ్చగొట్టడంలో మరాఠీ పార్టీలు సక్సెస్ అవుతున్నాయి. అవే ఓట్లుగా మారుతున్నాయి. మరాఠా పార్టీలను గుజరాతీ మోడీ షాలు చీల్చారన్నది పార్టీలు వ్యాప్తి చెందాయి. ఇక రిజర్వేషన్లు సున్నితమైన అంశంగా మారాయి. పెట్టుబడులన్నీ గుజరాత్ కు పోతున్నాయని క్యాంపెయిన్ చేశారు.
మహారాష్ట్ర ఎన్నికలు ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా వున్నాయి. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.