https://oktelugu.com/

Jammu Kashmir Election Results: మళ్ళీ ఐదేళ్లు కాశ్మీర్ పీఠం అబ్దుల్లాలదే

Jammu Kashmir Election Results: బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి చిన్నా చితకా పార్టీలతో కలిసి అధికారం ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉన్నారు. కానీ జనం ఆ అవకాశం బీజేపీకి ఇవ్వలేదు. బీజేపీ అనుకున్నన్నీ వచ్చినా.. కానీ రెండో వైపు కశ్మీర్ లోయలో మల్టీ పార్టీ కంటెస్టెంట్ ఉంటుందనుకున్నా అది జరగలేదు. కారణం ఏంటన్నది చూద్దాం.

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2024 / 09:57 PM IST

    జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితం ఎలా ఉంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన అంచనాలకు దగ్గరగా ఉంది. ఎడ్జ్ ఎన్సీ-కాంగ్రెస్ కు అనుకూలంగా ఇచ్చారు. అదే పునరావృతమైంది. 80వ దశకంలో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ లు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి వేర్పాటు వాదం ఏర్పడడానికి మూలకారణమైన ఆ రెండు పార్టీలకు ఇప్పుడు పట్టం కట్టారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశం. ఎవ్వరూ కూడా ఇంతగా గెలిస్తారని ఊహించలేదు.

    బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిచి చిన్నా చితకా పార్టీలతో కలిసి అధికారం ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉన్నారు. కానీ జనం ఆ అవకాశం బీజేపీకి ఇవ్వలేదు. బీజేపీ అనుకున్నన్నీ వచ్చినా.. కానీ రెండో వైపు కశ్మీర్ లోయలో మల్టీ పార్టీ కంటెస్టెంట్ ఉంటుందనుకున్నా అది జరగలేదు. కారణం ఏంటన్నది చూద్దాం.

    కశ్మీర్ లో ఆ ఓటమికి బీజేపీనే కారణం. ఈసారి అధికారం మాదేనని ప్రచారం చేసింది. మొట్టమొదటి సారి జమ్మూకశ్మీర్ లో ఏదైతే వారికి గిట్టని పార్టీ అయిన బీజేపీకి భయపడ్డారు. హిందూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయి. ఎలాగైనా సరే అధికారం మాకే కావాలని బీజేపీ చెప్పుకొచ్చింది. అది కశ్మీర్ లోని ముస్లింలలో భయం నెలకొంది. దీంతో ముస్లింలంతా ఏకమయ్యారు. ఎన్సీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. దీంతో ముస్లిం ఓట్లు పోలరైజ్ అయ్యాయి.. బీజేపీ చేసిన రెండో తప్పు.. అన్ని సీట్లకు పోటీచేయకపోవడం పెద్ద మైనస్ గా మారింది.

    మళ్ళీ ఐదేళ్లు కాశ్మీర్ పీఠం అబ్దుల్లాలదే.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.