Haindava Shankaravam : నిన్న కేసరపల్లి గన్నవరం వద్ద జరిగిన హైందవ శంఖారావం అందరి కళ్లు తెరిపించింది. ఎవ్వరూ ఊహించలేదు. ఆంధ్రాలో లక్షలాది మంది జనం హిందూ సమావేశానికి రావడం ఇదే మొదటి సారి. ఈ పద్ధతుల్లో పోటెత్తారు. నిన్నటిదాకా హిందుత్వ రాజకీయాలకు ఆంధ్రా ఆమడ దూరం. నేటి నుంచి రాజకీయ పండితుల ఆలోచనలు, అంచనాలు మార్పు చేసుకోబోతున్నాయి. ఈ సభ రాజకీయాలను చేసే వారిని ఉలిక్కిపడేలా చేసిన పరిణామం చోటు చేసుకుంది.
రాజకీయ నాయకులకు కూడా ఈ సభతో కిక్ వచ్చింది. ఆంధ్రా గురించి చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే.. ఆంధ్రా, తెలంగాణ పాలన పరంగా రెండు విభిన్న ప్రాంతాలు. ఆంధ్రా బ్రిటీష్ పాలనలో.. మద్రాసు ప్రావిన్సులో ఉన్నది ఆంధ్రా ప్రాంతం. క్రిస్టియన్ మిషనరీలతో నిండి ఉంది. ఆంధ్రాలోని కొద్ది ప్రాంతం పెరియార్ ప్రభావం ఉంది. ఇక కమ్యూనిస్టు ప్రభావం కూడా ఉంది. ఈ రెండింటి వల్ల కొత్త రకం సామాజిక కోణాలు ఇక్కడ వ్యాపించాయి.
దీని వల్ల తమిళనాడు వలే ఆంధ్రాలో కూడా కూడా ద్రవిడ నాస్తికవాదం వ్యాపించింది. కానీ ఇటీవల అయోధ్య రామాలయంతో హిందుత్వ వాదం పెరిగింది. మెజార్టీ ప్రజలు దేశంలో వివక్షకు గురికావడం ఏంటన్న ఆలోచన మొదలైంది.
ఆంధ్రాలో హిందువులు శంఖారావం పూరించారు.. ఈ సభ తర్వాత ఆంధ్రాలో పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.