Balakrishna vs Chiranjeevi: ఓజీ.. బ్లాక్ బస్టర్ అయ్యి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రెండో వైపు మొన్న జరిగిన సంఘటన దిగ్భ్రాంతి కలిగించింది. పవన్-చిరంజీవి మెగా అభిమానులు దీంతో కలత చెందారు.
ప్రజల దగ్గరకు వెళ్లేసరికి మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే. ఎన్నికల్లో రాజకీయాల్లో ఇటువంటివి పనిచేస్తాయి. సంవత్సరం నుంచి కూటమి రాజకీయం వివాదాలు లేకుండా సాగుతోంది.
మొన్న బాలకృష్ణ మాట్లాడిన మాటలతో చాలా భావోద్వేగాలకు లోనైంది. అది చిన్న విషయం కాదు. చిరంజీవి మెగా స్టార్. ఇటువంటి పరిణామాల్లో సామాజికవర్గాలుగా కూడా విడిపోయింది. అటువంటి అప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. బాలకృష్ణ వ్యాఖ్యలు చూస్తే ఆయన కండీషన్ లో లేకుండా అసెంబ్లీలో మాట్లాడినట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలా మాట్లాడడం దారుణంగా అనిపించింది.
బాలకృష్ణ సభ్య సమాజం తలదించుకునే పరిస్థితుల్లో మాట్లాడారు. వైసీపీ, జగన్ ఎంత హింసించినా.. ‘సైకో గాడు’ అంటూ మాట్లాడడం బాలయ్యను అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవిని ఇందులోకి లాగి బాలయ్య అవమానించేలా మాట్లాడడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
కూటమి ప్రభుత్వంలో చిచ్చుకు పునాది బాలకృష్ణ వ్యాఖ్యలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
