Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి వారాహి డిక్లరేషన్ సభ ఆయన రాజకీయ జీవితంలోనే ఓ పెద్ద మలుపు..చరిత్రాత్మకం.. సహజంగానే పవన్ కళ్యాణ్ ప్రాంతీయపార్టీని స్థాపించినా.. జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు.. మొదటి నుంచి జాతీయ భావాలు ఎక్కువ. పవన్ మాటల్లో జాతీయత ఎక్కువ.
మొట్టమొదటి సారి సనాతన ధర్మ పరిరక్షకుడిగా మార్పు చెందిన తర్వాత సభ జరిపారు. మొదటి నుంచి పవన్ భక్తుడే.. పూజలు, వ్రతాలు, దీక్షలు చేసే వ్యక్తి. తన ప్రసంగాల్లో సనాతన ధర్మంపై గతంలో మాట్లాడాడు.
మరి నిన్నటి ప్రసంగం ప్రత్యేకత ఏంటనేది చూడాలి. తిరుమల లడ్డూ విషయంలో ఆవేదన చెంది 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేసి తిరుపతిలో సభ పెట్టారు. అక్కడ చాలా క్లియర్ గా చెప్పారు. నేను ఉప ముఖ్యమంత్రిగా,జనసేన అధ్యక్షుడిగా మాట్లాడడం లేదని.. ఓ హిందూ భక్తుడిగా మాట్లాడుతున్నట్టు ప్రకటించారు.
సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ పరివర్తనపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.