https://oktelugu.com/

America : బంగ్లాదేశ్ లో జోక్యం చేసుకుంటూ భారత్ కి కీడు చేసిన అమెరికా

తాజాగా బంగ్లాదేశ్ విషయంలోనూ అమెరికా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ లో జోక్యం చేసుకుంటూ భారత్ కి కీడు చేసిన అమెరికా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2024 / 07:05 PM IST

    America : అమెరికా విదేశాంగ నీతి సక్సెస్ అయ్యిందా? ఫెయిల్ అయ్యిందా? ప్రపంచంలోనే అత్యంత శక్తివంత దేశం అమెరికా. వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ.. పర్ క్యాపిటల్ ఇన్ కం అదే స్థాయిలో ఉంది. మోస్ట్ పవర్ ఫుల్ మిలటరీ కంట్రీ అదే. ఇప్పట్లో అమెరికాను బీట్ చేసే వారు లేరు. మొదటి ప్రజాస్వామ్య రిపబ్లిక్. 1776లోనే రిపబ్లిక్ స్వాతంత్ర్యం పొందిన దేశం. మోస్ట్ ట్రాన్సపరెంట్ సొసైటీ. ఏ చర్య అయినా సరే ప్రజలకు తెలిసే పద్ధతిలోనే ఉంటుంది.ఇవన్నీ నిజాలే..

    అమెరికా అంటే ఇప్పుడు మోస్ట్ ఫెయిల్డ్ కంట్రీ ఇన్ ఫారెన్ ఎఫైర్. అమెరికా విదేశాంగ నీతి చూస్తే అన్ని దేశాలు జైజైలు కొట్టేలా ఉండాలి. 1950లో జరిగిన కొరియా వార్ లో అమెరికా చేసింది న్యాయం సక్సెస్ అయ్యింది. కమ్యూనిస్టు పాలన నుంచి సగం దేశం దక్షిణ కొరియాను విముక్తి చేసి అభివృద్ధికి బాటలు వేసింది. తర్వాత జరిగిన వియత్నాం యుద్ధాన్ని అమెరికా ఆర్భాటంగా మొదలుపెట్టి దారుణంగా విఫలమైంది. ఆ తర్వాత అప్ఘనిస్తాన్ యుద్ధం లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చి లాడెన్ ను మట్టుబెట్టారు. కానీ మధ్యలో ఇరాక్ తో యుద్దంలోకి వెళ్లారు. ఇరాక్ మీద దాడి చేసి అమెరికా ఫెయిల్ అయ్యింది. అప్ఘనిస్తాన్ పై చివర్లో చేతులెత్తేసి తాలిబన్ చేతుల్లోకి దేశాన్ని నెట్టేసి అమెరికా పెద్ద వైఫల్యాన్ని పొందింది..

    తాజాగా బంగ్లాదేశ్ విషయంలోనూ అమెరికా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాదేశ్ లో జోక్యం చేసుకుంటూ భారత్ కి కీడు చేసిన అమెరికా తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.