Vikravandi Bypoll : తమిళనాట జులై 10న విక్రవండి అసెంబ్లీకి ఉప ఎన్నిక జరుగబోతోంది. పోయిన సారి 2021లో డీఎంకే ఎమ్మెల్యే గెలిచారు. ఆయన చనిపోవడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇంకా 10 రోజులు టైం ఉంది.
తమిళనాట దారుణాతి దారుణంగా 57 మంది అమాయక ప్రజలు కల్తీ మద్యానికి బలైపోయారు. పోయిన సంవత్సరం జరిగిన ఘటన పక్కనే ఈ అక్రమ మద్యం ఏరులై పారి జనాలు చనిపోయారు.
మరక్కమ్ లో 30 మంది అక్రమమద్యంతో గతంలో మరణించారు. జనం ఇక్కడ డీఎంకేకే ఓటు వేసి గెలిపించారు. ఇటీవల ఎంపీగానూ డీఎంకే కూటమినే ఇక్కడ గెలిపించారు.
గత సారి అక్రమ మద్యంతో చనిపోయారు. ఇప్పుడు ఇదే జిల్లాలో 57 మంది చనిపోయారు. మరీ ఈసారి ఉప ఎన్నికల్లోనైనా తమిళ ఓటర్లు స్పందిస్తారా.? డీఎంకే ను ఓడిస్తారా? అన్నది చర్చనీయాంశమైంది.
అయితే ఈ ఉప ఎన్నికలకు అన్నాడీఎంకే దూరమైంది. ఎందుకు అన్నాడీఎంకే విక్రవండి ఉప ఎన్నికను బహిష్కరించింది?’ అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడండి..