https://oktelugu.com/

Bangladesh: బంగ్లాదేశ్ లో హిందువులపై మళ్ళీ దాడులు, అరెస్టులు, లూటీలు

Bangladesh: దీనిపై సీరియస్ అయిన బంగ్లాదేశ్ అతివాద పార్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి హిందువులపై దాడులు చేశారు. మానభంగాలు చేశారు. సీసీటీవీలు పగులకొట్టి లోపలికెళ్లి షాపులు ధ్వంసం చేసి బంగారం ను పోలీసులు దోచుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2024 11:48 am

    బంగ్లాదేశ్ లో హిందువులపై మళ్లీ దాడులు జరుగుతున్నాయి. చిట్టగాంగ్ లో హిందువులు అంతా ఏకమై నిరసన ప్రదర్శన చేశారు. అక్టోబర్ 25న హిందువులు బయటకొచ్చి నిరసన గళం తెలుపడాన్ని తీవ్రవాద సంస్థలు జీర్ణించుకోలేకపోయాయి. ఇప్పుడున్న మహ్మద్ యూనస్ ప్రభుత్వంలో తీవ్రవాద ముస్లిం వాదానికి మద్దతు ఇచ్చేవారే ఎక్కువగా ఉన్నారు. దీంతో బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి దారుణంగా మారింది.

    చిట్టగాంగ్ లో హిందువుల నిరసనపై ‘చిన్మయ కృష్ణదాస్’ అనే హిందూ యోగిపై కేసులు నమోదు చేశారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు ‘ఇస్కాన్’ చేసే 18మందిపై కేసులు పెట్టారు. దేశద్రోహం కింద కేసులు పెట్టారు. జైశ్రీరామ్ స్లోగన్ ఇవ్వడం దేశద్రోహమట.. దీన్ని నిరసిస్తూ ఇంకొక ర్యాలీ తీశారు.సనాతన్ జాగరణ్ ర్యాలీ అంటూ మరోసారి హిందు ర్యాలీ నిర్వహించారు.

    దీనిపై సీరియస్ అయిన బంగ్లాదేశ్ అతివాద పార్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి హిందువులపై దాడులు చేశారు. మానభంగాలు చేశారు. సీసీటీవీలు పగులకొట్టి లోపలికెళ్లి షాపులు ధ్వంసం చేసి బంగారం ను పోలీసులు దోచుకున్నారు.

    బంగ్లాదేశ్ లో హిందువులపై మళ్ళీ దాడులు, అరెస్టులు, లూటీలు సాగుతున్నాయి. అక్కడి పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

    బంగ్లాదేశ్ లో హిందువులపై మళ్ళీ దాడులు, అరెస్టులు, లూటీలు || Bangladesh Hindu community || ISKCON