https://oktelugu.com/

Pawan Kalyan : గ్రామ సభల తర్వాత పల్లె పండగ మరో పవన్ కళ్యాణ్ మార్కు కార్యక్రమం

పోలవరం సహా ఏపీకి ఎన్నో పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో ఏపీకి నిధుల వరద పారుతోంది. రైల్వే జైన్లు, రోడ్లు, రైల్వేలు కేటాయించారు. చాలా అద్భుతంగా ఏపీకి మంచి పనులు జరుగుతున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2024 / 07:20 PM IST

    Pawan Kalyan  : పవన్ కళ్యాణ్ గ్రామాల రూపు రేఖలు మార్చడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆగస్టు 15 సందర్భంగా గ్రామపంచాయితీల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించి గ్రామస్థులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరో సారి గ్రామాల మౌళికవసతులు కల్పించే అతిపెద్ద క్రతువును తలకెత్తుకున్నారు. అక్టోబర్ 14 నుంచి పల్లెపండుగ వారోత్సవం అంటూ ప్రతీ గ్రామంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో పండుగ చేయబోతున్నారు. ప్రజలకు తెలిసేలా పారదర్శకంగా బోర్డులు పెడుతూ 30వేల పనులు 4500 కోట్లతో చేయబోతున్నారు. దీనికి సంక్రాంతి డెడ్ లైన్. ఇది చాలా గొప్ప పని.. ఇది ఆంధ్రాకే సువర్ణాధ్యాయం..

    పోలవరం సహా ఏపీకి ఎన్నో పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో ఏపీకి నిధుల వరద పారుతోంది. రైల్వే జైన్లు, రోడ్లు, రైల్వేలు కేటాయించారు. చాలా అద్భుతంగా ఏపీకి మంచి పనులు జరుగుతున్నాయి.

    కేంద్రం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ఇప్పుడు పంచాయితీల రూపు రేఖలు మార్చడానికి రెడీ అయ్యారు. ఆగస్టు 15కు పంచాయితీలకు నిధులు గ్రాంట్ ఇచ్చి ఘనంగా స్వాతంత్ర్యం దినోత్సవ వేడుకలు నిర్వహించడం పవన్ గొప్పతనం.. ఒకేసారి ఏపీలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం ఆయనకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఇక వరదలు వచ్చినప్పుడు 400 పంచాయితీలకు లక్ష చొప్పున సొంత డబ్బులు ఇవ్వడం.. 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే వాటిని పంచాయితీలకు నేరుగా బదిలీ చేయడం.. పాత బకాయిలు చెల్లించడం.. గ్రామీణ రోడ్ల 1250 కోట్లు, ఏజెన్సీలకు 250 కోట్లు.. ఇలా తన మార్క్ పరిపాలన కనిపిస్తోంది. ముఖ్యంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ కామ్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.

    పవన్ కళ్యాణ్ మరో వినూత్న కార్యక్రమం పల్లె పండగ’పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.