6th World Telugu Writers Mahasabha : నిన్నా మొన్నా విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. వక్తలు తెలుగు వాడకంపై చాలా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కారణాలు విశ్లేషించకుండా ఇది విజయవంతం కాలేదని అనిపిస్తోంది. మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. అయితే నూతన విద్యావిధానం కూడా ప్రాంతీయ భాషలకు పెద్ద పీట వేసింది. ప్రాథమిక విద్య వరకూ మాతృభాషలోనూ నిర్వహించాలి.
కానీ తెలుగు తగ్గడానికి వాడకం ఇదే కారణమా? దీని మీద లోతైన విశ్లేషణ జరగలేదు. అందులో ఒక కారణం ‘భాషా ప్రయుక్త రాష్ట్రాలే తెలుగు వాడకానికి శాపంగా మారాయి. 1953లో మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడడంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంకురార్పణ జరిగింది. 1951 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టైతే తెలుగు వాడేవాళ్లు దేశంలో 9.24 శాతం ఉన్నారు. దేశంలోనే రెండో అత్యధిక వాడుక భాష తెలుగు ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే.. 4వ స్థానానికి పడిపోయాం. 6.7 శాతమే తెలుగు వాడుతున్నాం. ఒకనాడు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు వాడకం.. కేవలం ఆంధ్రా, తెలంగాణకే పరిమితమైంది.
ఇతర రాష్ట్రాల్లో తెలుగు మాతృ భాషగా వున్న కులాలేవి? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.