2024 ముగిసింది. ఇందులో ప్రధానమైన సంఘటన తిరిగి మూడో సారి మోడీ అధికారంలోకి రావడం.. కాకపోతే 400కు పైగా కావాలనే సీట్లు నినాదం బెడిసికొట్టింది. సొంతంగా మెజార్టీలోకి బీజేపీ రాలేదు. రామాలయం ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ లో మొత్తం 80 సీట్లకు కేవలం 33 సీట్లకే పరిమితమైంది. 244 స్థానాలకే పరిమితమైంది. ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. విశ్లేషఖులు, మీడియా సర్వేలు అన్ని కూడా బీజేపీపై అంచనాలు అందుకోలేకపోయాయి..
కానీ ఒకే ఒక సంఘటన మోడీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చింది. అదీ ఆంధ్రాలో జరిగిన ఘటన.. ఆంధ్రాలో బీజేపీకి ఎటువంటి బలంలేని చోట ఎన్డీఏ 160కి పైగా అసెంబ్లీ స్థానాలు, మెజార్టీ 16 ఎంపీ సీట్లను కూటమికి రావడంతో కేంద్రంలో మోడీ సర్కార్ నిలబడగలిగింది. దీనికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ నే..
అటు బీజేపీని కన్విన్స్ చేసింది.. ఇటు టీడీపీని ఒప్పించి కూటమిని పట్టాలెక్కించింది పవన్ కళ్యాణ్ నే.. అదే ఇప్పుడు దేశ రాజకీయాలకు కీలకమైంది. ఇదీ నేపథ్యం. 2024 రాజకీయాలను మలుపు తిప్పింది మన పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు.
2024 రాజకీయాలకు సూత్రధారి పవన్ కళ్యాణ్.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.