Balochistan : బెలూచీస్థాన్.. అట్టుడికి పోతోంది. ఈసారి జరిగిన అల్లర్లు.. అంతర్యుద్ధానికి ముందు దశగా చెప్పొచ్చు. ఈ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయంటే.. ‘నవాబ్ అక్బర్ భుక్తి’ 18వ వర్ధంతి సందర్భంగా ఈ అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి.
నవాబ్ అక్బర్ భుక్తి బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి, గవర్నర్ గా పనిచేశాడు. 2005లో బెలూచిస్తాన్ స్వాతంత్ర్య ఉద్యమంలోకి నవాబ్ అక్బర్ తన పదవిని వదిలేసి దిగారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఆయనను కాల్చిపారేసింది.
ఆయన వర్ధంతి రోజున బెలూచిస్తాన్ ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు దిగారు. ఈసారి బెలూచిస్తాన్ లో ఆరు చోట్ల పెద్ద పెద్ద ఆందోళనలు చేశారు. బేలాలోని పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పై దాడి చేశారు. మొత్తం 40 మంది పాకిస్తాన్ సైనికులను చంపామని ఆందోళనకారులు చెబుతున్నారు. కానీ పాక్ మాత్రం 12 మందే చనిపోయారంటున్నారు.
ఆపరేషన్ హెరాల్డ్ అంటూ బెలూచిస్తాన్ లోని ఉత్తరం నుంచి దక్షిణం వరకూ పోరాటం చేస్తున్నారు ఆందోళనకారులు.. 800పైగా బెలూచీ గెరిల్లాలు పాల్గొన్న ఆపరేషన్ హెరాఫ్ పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.