Amit Shah- Chandrababu: ‘మీకు కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా..కడుపునకు ఆకలేస్తే కంచం లో కూడునవుతా ..కొట్లాట కొస్తే ఎత్తిన చేతిని నారికే కత్తి నవుతా’ ఛత్రపతి సినిమాలో ప్రబాస్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ ఇది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పాలుపంచుకుంటానని హీరో ఇచ్చే భరోసా. కానీ ఇటువంటి భరోసాయే ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు నిత్యం తెలుగుదేశం పార్టీకి ఇస్తుంటారు. పార్టీ ఎప్పుడూ కష్టాల్లో ఉన్నా వాలిపోతారు. మీడియా తరుపునే కాకుండా మోరల్ సపోర్టు చేస్తారు. తనకు కలిగిన కష్టంగా భావించి టీడీపీ ని సమస్యల నుంచి గట్టెక్కుస్తుంటారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాల నుంచి ఆ పార్టీకి గట్టెక్కించగలిగారు. అయితే ఇప్పుడు మరోసారి ఆ గురుతర బాధ్యతను రామోజీరావు తీసుకున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని బీజేపీతో కలిపేందుకు ఆయన తెగ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీ ప్రయత్నానికి మీడియా సపోర్టు ఇస్తానన్న హామీతో ఆయన చంద్రబాబును బీజేపీకి దగ్గర చేస్తున్నారన్న టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. అందుకే తన రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకే వేదికపై అమిత్ షాను, చంద్రబాబును తేవడానికి రామోజీరావు ప్రయత్నించి సఫలమయ్యారని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఆదివారం సాయంత్ర ఫిల్మ్ సిటీలో తేనేటి విందులో తెలుగు రాజకీయాల గురించి అమిత్ షా, చంద్రబాబు, రామోజీరావులు చర్చించే అవకాశమున్నట్టు సమాచారం.
మారిన షెడ్యూల్ వెనుక?
తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. అటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు క్యూకడుతున్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. మునుగోడులో భారీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. ఈ సభ అయిన తరువాత ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడు నుంచి ఆయన హైదరాబాద్ చేరుకోవాలి. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోవాలి. ఇది ముందుగా ఫిక్సయిన షెడ్యూల్. అయితే ఈ పర్యటనకు ముందు రోజే షెడ్యూల్ మారింది. ఆయన మునుగోడు నుంచి హెలికాప్టర్లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకోనున్నారు. రామోజీరావుతో భేటీ కానున్నారు. అంతవరకూ పర్వాలేదు కానీ ఈ భేటీకి చంద్రబాబు కూడా హాజరవుతుండడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ రామోజీరావు పట్టుపట్టి మరీ ఏర్పాటు చేశారన్న టాక్ అయితే నడుస్తోంది.
Also Read: YCP: చేజేతులా ఆ వర్గాలను వదులకున్న వైసీపీ..వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బే..
పొత్తు అంశం ప్రస్తావన..
అయితే ఈ భేటీలో చంద్రబాబు ఏం ప్రస్తావిస్తారు. వారి మధ్య చర్చకు వచ్చే అంశాలు ఏమిటన్నది ఇప్పుడు తెలుగునాట చర్చనీయాంశమవుతున్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో, 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని గట్టి ప్రయత్నంతో ఉంది. అదే సమయంలో ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్రంలోని బీజేపీ సహాయం కోరుతూ వస్తోంది. కానీ గత మూడేళ్లుగా చంద్రబాబును దూరం పెడుతూ వచ్చిన కేంద్ర పెద్దల వ్యవహార శైలిలో ఇటీవల మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ జరుగుతుండడంతో చంద్రబాబు పొత్తు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీలో మాకు సహకరిస్తే..తెలంగాణలో టీడీపీ కేడర్ తో పాటు 40 నియోజకవర్గాల్లో సెటిలర్స్ ఓట్లు వేయిస్తామని చంద్రబాబు చెప్పే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీనికితోడు మీడియాపరంగా కూడా రామోజీరావు సపోర్టు చేస్తానని చెప్పడం ద్వారా అమిత్ షాను మెత్తబరిచే అవకాశముందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ ఉంటుందని అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
Also Read:Eenadu: సండే స్పెషల్: ఇప్పటికీ ఆ పత్రికే నెంబర్ వన్.. ఇది ఎలా సాధ్యం?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Ramoji raos master plan amit shah chandrababu meet today
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com