Pushpa: ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మేనియా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న సినిమా ఇది. డిసెంబరు 17న అంటే రేపే ఈ సినిమా థియేటర్లలో సందడ చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన లభిస్తోంది. ఈ క్రమలోనే అడ్వాన్స్ బుకింగ్స్ హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. మరోవైపు ఓవర్సీస్లోనూ సమస్య క్లియర్ అయిపోయింది. బాలీవుడ్‌లోనూ విడుదల విషయంలో సందేహం ఉందని అన్నవారికి.. సోషల్‌మీడియా వేదికగా 5 భాషల్లో సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని ప్రకటించి మేకర్స్ అందరి ఊహాగానాలకు చెక్ పెట్టేశారు.
Also Read: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !
ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా తమిళనాడులో 280 థియేటర్లలో.. కేరళ 200, ఆంధ్ర, తెలంగాణ కలిపి 1150, కర్ణాటకలో 140పైగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు బాలీవుడ్లో 600కుపైగా థియేటర్లను బుక్‌చేసుకుంది పుష్ప. ఓవర్సీస్లోనూ 600కుపైగా థియేటర్లను లాక్‌చేసి..దాదాపు ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్లకు పైగా పుష్పరాజ్ సందడి చేససేందుకు సిద్ధమయ్యాడు.
ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న పుష్పరాజ్ ఎలా అలరిస్తాడో చూడాలని ప్రేక్షకులతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. సునీల్, అనసూయతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ పక్కా ఊరమాస్ లెవెల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో సమంతా ఐటెం సాంగ్‌లో కనిపించనుండటం విశేషం.
Also Read: టాప్ టెన్ లిస్ట్ లో బన్నీ.. కానీ మెగాస్టార్ కంటే తక్కువే !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More