Puneeth Rajkumar James Movie: వచ్చే వారం కన్నడ నాట సినిమా జాతర జరగబోతుంది. సూపర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పునీత్ చివరి చిత్రాన్ని ప్రత్యేకంగా తీసుకుంది కన్నడ ఇండస్ట్రీ. ఆ రోజున ప్రతి కన్నడ స్టార్ హీరో పునీత్ సినిమా చూస్తాడట. దీని గురించి త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
పునీత్ నటించిన చివరి చిత్రం పై ఫ్యాన్స్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఈ సినిమాతో అన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా పునీత్ ఫ్యాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా తమ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: బాక్సాఫీస్ : ‘రాధేశ్యామ్’ ఏపీ & తెలంగాణ సెకండ్ డే కలెక్షన్స్
కాగా ‘జేమ్స్’ నుంచి విడుదలైన ఈ సినిమా టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పునీత్ ఎప్పటికీ కింగ్. బిగ్ స్క్రీన్ పై అప్పు సార్ ను చూసేందుకు వెయిటింగ్. చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపించినట్లుగానే మిగిలిన హీరోలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఫ్యాన్స్ అయితే.. ఇప్పటి నుంచే పునీత్ చిత్ర పటాలను రెడీ చేస్తున్నారు. ఇక పునీత్ పేరట ఓ గుడిని కూడా కట్టబోతున్నారని తెలుస్తోంది. పునీత్ పై ఇప్పటికే ఒక దేవాలయాన్ని కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
Also Read: ఆ స్టార్ తో ఈ యంగ్ హీరోయిన్ పెళ్లి ఫిక్స్ !
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More