Emergency in India- Modi: ఎమర్జెన్సీ నాటి రోజులవి. ఓ యువకుడు తలపాగా ధరించి, గడ్డం పెంచి సిక్కుగా మారాడు. సర్దార్ వేషధారణతో అసలు రూపం గుర్తుపట్టని విధంగా తయారయ్యాడు. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు. ఆయన ఎవరో తెలుసా మన ప్రధాని నరేంద్ర మోదీ. అది 1975, జూన్ 25… అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సిఫార్సుపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితి తదుపరి 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీతో సహా చాలా మంది విపక్ష నేతలు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలపైనే అధికంగా దాడులు జరిగాయి. వీరిలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మోదీ తన వేషాన్ని మార్చుకున్నారు.
తలపాగా ధరించి, గడ్డం పెంచి సిక్కుగా మారారు. ఈ సర్దార్ వేషధారణలోనే ప్రధాని నరేంద్రమోదీ పోలీసులకు చిక్కారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నేతలను రెండేళ్లపాటు జైల్లో పెట్టి, పత్రికా స్వేచ్ఛకు ‘తాళం’ వేసి, సామాన్య ప్రజలకు సైతం ఇబ్బందులు కలిగించారనే ఆరోపణలున్నాయి. నాటి ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ క్రియాశీల పాత్ర పోషించింది. ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్న నరేంద్ర మోదీకి ఆందోళనలు, సదస్సులు, సమావేశాలు, సాహిత్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను అప్పగించారు.
Also Read: Adani- YCP Government: అదానీ అడిగితే ఓకే.. ఏపీ సర్కారు తీరుపై పారిశ్రామికవర్గాల విస్మయం
ఆ సమయంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత కేశవరావు దేశ్‌ముఖ్‌ను గుజరాత్లో అరెస్టు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ తనను కూడా అరెస్టు చేస్తారని పసిగట్టి సర్దార్ అవతారం ఎత్తారు. ఎమర్జెన్సీ నాటి గురుతులను నెమరువేసుకునే క్రమంలో ప్రధాని మోదీ సర్దారుగా మారిన నాటి ద్రుశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసేందుకు నెటిజెన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
Also Read:Anantapur District Puleti Erragudi: ఆ మహిళ అలక.. గ్రామానికి చేటు తెప్పించిందట
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Prime minister modi incarnated as sardar during the emergency
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com