Woman Bike Ride In Kashmir: కశ్మీర్.. దేశంలోనే అంతమైన ఈ లోయ పేరు వినగానే.. సైన్యం బూట్ల చప్పుళ్లు.. తుపాకుల మోతలు.. బాంబుల పేలుళ్లు.. ఎన్‌కౌంటర్లు, బాంబ్ బ్లాస్ట్‌లు.. అమాయకుల కాల్చివేతలు.. అయితే ఇదంతా నాలుగేళ్ల క్రితం వరకు.. నేడు పరిస్థితులు మారిపోయాయి. అందమైన కశ్మీర్‌లో స్వేచ్ఛా పవనాలు వీస్తున్నాయి.. ప్రజలు భయం వీడారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రం తీసుకున్న ఒక్క నిర్ణయం కశ్మీర్ తలరాతనే మార్చింది. అక్కడి ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు ప్రసాదించింది.
ఆర్టికల్ 370 రద్దుతో..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కశ్మీర్ అంశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2020, ఆగస్టు 5న ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఈ క్రమంలో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని మోదీ సర్కార్ స్పష్టం చేస్తూ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, ఆర్టికల్ రద్దు అనంతరం, జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేసి నాలుగేళ్లు పూర్తయిన తర్వాత శ్రీనగర్‌లో తమకు ఎంతటి ఆహ్లాదకర పరిస్థితులు ఉన్నాయో ఓ యువతి ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చింది. దీంతో, ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బైక్ రైడింగ్..
శ్రీనగర్‌లో ఓ యువతి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడుపుతూ రోడ్లపై ఎంజాయ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ‘ఈరోజు నేను గర్వంగా చెప్పాలనుకుంటున్నాను.. నా కశ్మీర్ అబ్బాయిలకే కాదు.. మనలో కూడా చాలా మారిపోయింది. 370, 35ఏ రద్దుకు ముందు ఇది సాధ్యం కాలేదు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేసింది.
నెట్టింట హల్‌చల్..
యువతి బైక్ రైడింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై కశ్మీర్ యువకులు స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వీడియోను పోలీసులకు షేర్ చేస్తూ అబ్బాయిలకే ట్రాఫిక్ రూల్స్ వర్తిస్తాయా? అమ్మాయిలకు వర్తించవా? అని ప్రశ్నించారు. దీంతో, పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు జరిమానా విధించినట్టు స్పష్టం చేశారు. అయితే జరిమాన పోతే పోయింది.. కశ్మీర్‌లో మాత్రం ప్రశాంతత నెలకొంది… దటీస్ మోడీ.. భారత్ మాతాకీ జై.. అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.
Is Law only for boys? @SSPTFCSGR @KashmirPolice @RTOKashmir young girl on bike perform staunts. pic.twitter.com/YnPMoilVkB
— Peerzada Waseem (@Waseemjourno) August 3, 2023