Popular CM: దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ నిలిచారు. మొన్నటి వరకు మొదటి స్థానంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ను వెనక్కి నెట్టి నవీన్‌పట్నాయక్ అగ్రస్థానానికి చేరుకున్నారు. యోగి రెండో స్థానంలో నిలిచారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రుల ఆదరణ గురించి సర్వే నిర్వహించింది. ఇందులో సంస్థ సీఎంలకు రేటింగ్ ఇచ్చింది. ఇందులో బీజూ జనతాదళ్(బీజేడీ) అధినేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్ 52.7 శాతం రేటింగ్‌లో దేశంలోనే అత్యంత పాపులర్ సీఎంగా మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 51.3 శాతం రేటింగ్‌లో రెండో స్థానంలో ఉన్నారు.
తర్వాతి స్థానాల్లో..
ఇక మూడ్ ఆఫ్‌ది నేషన్ సర్వేలో మిగతా స్థానాలు చూస్తే అసో సీఎం హిమంత బిశ్వశర్మ 48.6 శాతం రేటింగ్‌లో ప్రజాదరణలో మూడో స్థానంలో ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రపటేల్ 42.6 శాతంతో నాలుగోస్థానంలో ఉన్నారు. త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతం ప్రజాదరణతో ఐదో స్థానంలో నిలిచారు.
మాణిక్ సాహాపై ప్రజల ప్రసంశలు..
ఇదిలా ఉండగా, త్రిపుర సీఎం మాణిక్ సాహాపై ఆ రాష్ట్ర ప్రజలు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధికి అక్కడి ప్రజలు కొనియాడారు. ఇక ప్రజాదరణలో మొదటి స్థానంలో ఉన్న నవీన్‌పట్నాయక్ 1946, అక్టోబర్ 16న జన్మించారు. రెండు దశాబ్దాలుగా ఒడిశా సీఎంగా కొనసాగుతున్నారు.