Yellow Media : జనం నిండుగా ఉన్నా.. వారి పత్రికల్లో ఖాళీలే..

కనీసం ఆ దిశగా ఒక్క ముక్క కూడా రాయకపోవడం గమనార్హం. పొరపాటున ఇదే పరిస్థితి వైసీపీలో ఉంటే పచ్చ మీడియా ఎలా రాసేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Written By: NARESH, Updated On : November 25, 2023 10:11 pm
Follow us on

Yellow Media : ఫర్ సపోజ్ చంద్రబాబు నాయుడు ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఐదు కాలాల ఫోటో వేస్తాయి. తాటికాయంత అక్షరాలతో శీర్షిక పెడతాయి. డెక్కులు, సూపర్ లీడ్, ఇంట్రో, కళ్ళకు కట్టినట్టు ఉండే పేజినేషన్.. అదే జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి పూర్తిగా రివర్స్ అవుతుంది. జనం భారీగా వచ్చినప్పటికీ ఖాళీగా కుర్చీల ఫోటోలే అక్కడ కనిపిస్తాయి.. అంటే సాక్షి ఇందుకు విరుద్ధమని కాదు..అందులో కూడా ఇలానే ఉంటుంది.. అప్పుడప్పుడు అది జర్నలిజం ప్రమాణాలు కొంతలో కొంత పాటిస్తుంది. చంద్రబాబు ఏదైనా మీటింగ్లో పాల్గొంటే డబుల్‌ కాలమో, లేదా త్రీ కాలమో వార్తను ప్రజెంట్‌ చేస్తుంది. ఫొటోలు కూడా వాడుతుంది. జర్నలిజంలో పచ్చ జర్నలిజం వేరు కదా. ఆ పచ్చ బాస్‌ల దృష్టిలో వార్త అంటే చంద్రబాబు దే. వారికి అనుకూలంగా ఉంటే పవన్‌ కల్యాణ్‌ పతాకస్థాయి వార్తల్లోకి ఎక్కుతాడు. లేకుంటే తిరస్కారానికి గురవుతాడు. అంతేనా ఎన్ని రకాల వక్రీకరణలు చేస్తారో, మరెన్ని రకాల ఇబ్బందులుపెడతారో ఎవరికీ తెలియదు గనుక. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి వార్తలు రాశారో తెలుగు సమాజానికి విధితమే.

పచ్చమీడియా టార్గెట్‌ మంత్రాన్నే ఎంచుకుంది

జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి(ఇక్కడ వైసీపీ సుద్ధపూస కాదు) పచ్చమీడియా టార్గెట్‌ మంత్రాన్నే ఎంచుకుంది. జగన్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రతీ పనిలో భూతద్దం పెట్టి వెతికింది. దీంతో ఒళ్లు మండిన జగన్‌ పచ్చ మీడియాలో కీలకంగా ఉన్న ఆంధ్రజ్యోతికి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం మానేశాడు. ఈనాడుకు ఇస్తున్నప్పటికీ(ఇప్పుడు వద్దనుకుంది) మార్గదర్శి విషయంలో దాని ఓనర్‌ రామోజీరావును ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. అందుకే ఏపీలో పచ్చమీడియా వర్సెస్‌ జగన్‌ ప్రభుత్వంగా వ్యవహారం కొనసాగుతోంది.

జనం భారీగా వచ్చినా..

ప్రస్తుతం ఏపీలో అక్కడి వైసీపీ నాయకులు తమ ప్రభుత్వం సాధించిన విజయాలపై సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సహజంగానే వీటికి భారీగా జనం వస్తున్నారు. ఇలాంటి సమయంలో జర్నలిజం ప్రమాణాల ప్రకారం వార్తను వార్త లాగా రాయాలి. జనం బాగా వస్తే బాగా వచ్చారని, రాకుంటే రాలేదని చెప్పాలి. కానీ జనం బాగా వచ్చినా ఖాళీ కుర్చీలను చూపించడం, ఎక్కడో ఏదో చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం పచ్చ మీడియాకే చెల్లింది. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఏదో జరిగిపోతోందని రాసిన పచ్చ మీడియా.. ఆయన విడుదలైన తర్వాత ఏపీకి కొత్త శకం వస్తుందని రాయడం విశేషం. మరి ఇదే సమయంలో భువనేశ్వరి పరామర్శలు ఎందుకు ఆగిపోయాయో చెప్పకపోవడం, కనీసం ఆ దిశగా ఒక్క ముక్క కూడా రాయకపోవడం గమనార్హం. పొరపాటున ఇదే పరిస్థితి వైసీపీలో ఉంటే పచ్చ మీడియా ఎలా రాసేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.