https://oktelugu.com/

Yatra 2 Review: యాత్ర 2 ఫుల్ మూవీ రివ్యూ…

జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా డీటెయిల్ గా చూపించిన విధానం అయితే బాగుంది. అలాగే దర్శకుడు ఎంతసేపు వీళ్లిద్దరిని మాత్రమే ఫోకస్ చేసి చూపించాడు తప్ప, బయట పార్టీలు ఎలా ఫీలవుతున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : February 8, 2024 / 12:23 PM IST

    Yatra 2 Review

    Follow us on

    Yatra 2 Review: ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు విజయం సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాపులుగా మిగులుతున్నాయి. అందులో ముఖ్యంగా బయోపిక్ లు, సీక్వెల్ సినిమాల ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తుంది. ఇక అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రని ఆధారంగా చేసుకొని తీసిన ‘యాత్ర ‘ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అందులో భాగంగానే ఆ సినిమాకి సిక్వల్ గా ఇప్పుడు ‘యాత్ర 2’ అనే సినిమా వచ్చింది. ఇక ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది. యాత్ర సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుందా ? లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

    కథ
    ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ‘ ప్రజా సంకల్పయాత్ర’ ని బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో ఆయనకి ఎదురైన సంఘటనలు ఏంటి.? మమ్ముట్టి (రాజశేఖర్ రెడ్డి పాత్ర) మరణం తర్వాత ప్రజలు అన్ని కోల్పోయామని అనుకుంటున్న సందర్భంలో జీవా (జగన్ పాత్ర) వచ్చి జనాలకు ఏం చేశాడు.? తన పార్టీని ఎలా కాపాడుకున్నాడు. అదే సమయం లో అధికారంలో ఉన్న పార్టీ తనని అణిచివేయాలని చూస్తే, ఎవ్వరికీ లొంగకుండా ఆయన ముందుకు ఎలా సాగాడు అనే పాయింట్ ను బేస్ చేసుకొని ఈ సినిమా నడుస్తుంది… ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథ ఎంటనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ
    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమాని ఎక్స్ ట్రా ఆర్డినరీ గా తెరకెక్కించాడు. ముందుగా ఈయన తీసిన యాత్ర సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించింది. ఇక వైఎస్ గారి పాత్ర ను స్క్రీన్ మీద రిప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఇక ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా కనిపించి మెప్పించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడనే చెప్పాలి. ఇది ఏ పార్టీని వ్యతిరేకించే విధంగా లేదు,కానీ రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అనే భావాలను మాత్రమే చాలా స్పష్టంగా తెలియజేశారు. ముఖ్యంగా కొన్ని సీన్లలో అయితే ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కన్నీళ్లు వస్తాయనే చెప్పాలి. మమ్ముట్టి క్యారెక్టర్ చనిపోయినప్పుడు సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఒక ఎమోషనల్ ఫీల్ లోకి వెళ్తాడు. ఆ సీన్ లో కంటతడి పెట్టుకోకుండా ఉండరు.

    ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా డీటెయిల్ గా చూపించిన విధానం అయితే బాగుంది. అలాగే దర్శకుడు ఎంతసేపు వీళ్లిద్దరిని మాత్రమే ఫోకస్ చేసి చూపించాడు తప్ప, బయట పార్టీలు ఎలా ఫీలవుతున్నాయి. ఎలాంటి వ్యూహాలను రచిస్తున్నాయి అనేదాని మీద డీటెయిలింగ్ గా చెప్పలేకపోయాడు. ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, కథను ఆయన అల్లుకున్న విధానం చాలా బాగుంది. ఇక నిజజీవితంలో నుంచి కొన్ని అంశాలను తీస్తే కొన్నింటిని కల్పితంగా సృష్టించాడని తెలుస్తుంది…

    నటీనటుల పనితీరు
    ఇక ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ గా నటించిన మమ్ముట్టి, జీవాల క్యారెక్టర్లు చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా వాళ్ళు పలికించిన హావభావాలు కూడా ఆ పాత్రలకి సరిగ్గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా జీవాకీ అయితే ఇది ఒక మంచి సెకండ్ ఇన్నింగ్స్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన చేస్తున్న ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ సాధించడం లేదు. కాబట్టి ఈ సినిమాతో ఆయన మరొకసారి హిట్ ట్రాక్ ఎక్కడనే చెప్పాలి. ఆయన నటనలో పరిణితి కూడా కనిపించింది. కాబట్టి ఇక మీదట ఆయన ఇండస్ట్రీ లో ఒక మంచి నటుడుగా కొనసాగబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇక మహేష్ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు…

    టెక్నికల్ అంశాలు
    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ మాత్రం బావుంది. అలాగే కొన్ని సాంగ్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ పాయింట్ గా మారాయి. ఇక కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన ఆర్ ఆర్ మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండానే వాళ్ల కంట్లోనుంచి నీళ్ళు రప్పిస్తాయి. ఈ సినిమాకి దర్శకుడు ఎంతగా కష్టపడ్డాడో, సంతోష్ నారాయణ కూడా తన మ్యూజిక్ తో ఈ సినిమాని మరొక మెట్టు పైకి ఎక్కించాడనే చెప్పాలి. ఇక మది సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉందనే చెప్పాలి. ఆయన ఎప్పుడు తెలుగు సినిమా చేసిన కూడా తన మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది.ఆర్టిస్ట్ లను స్క్రీన్ మీద కొత్తగా చూపిస్తాడు. ఇక ఈ సినిమాకు ఆయన అందించిన విజువల్స్ అయితే ఈ సినిమాకు ఒక రీచ్ లుక్ ఇచ్చిందనే చెప్పాలి… ఎడిటర్ కూడా సీన్లని ఎక్కువగా లాగ్ చేయకుండా సీన్లల్లో ఉన్న డెప్త్ ని మాత్రమే పట్టుకొని ఒక సీన్ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంచి మిగతాదంతా కట్ చేశాడు. అది కూడా ఈ సినిమాకి చాలావరకు ప్లస్ అయింది…

    ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే

    డైరెక్షన్
    మ్యూజిక్
    జీవా యాక్టింగ్

    ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే

    రియల్ కథ అని చెప్పి అందులో కొంత కల్పిత కథని కూడా ఆడ్ చేసి చూపించారు.

    కొన్ని సీన్లు ఎక్కువ డ్రమటికల్ గా ఉండడం వల్ల ప్రేక్షకులు వాటిని చూసినప్పుడు ఆ సీన్ల ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు…

    ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5