Writer Padmabhushan Review: నటీనటులు: సుహాస్,టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి , రోహిణి
నిర్మాతలు : భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు
డైరెక్టర్ : షణ్ముఖ ప్రశాంత్
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్..అతని కెరీర్ ని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది..అంత చిన్న స్థాయి నుండి నేడు టాలీవుడ్ లో మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుగా కొనసాగడం అంటే అతని టాలెంట్ ఎలాంటిదో..అతను దానికోసం పడిన కష్టం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..కేవలం కమెడియన్ గా మాత్రమే కాదు..హీరో గా కూడా అతను సక్సెస్ అయ్యాడు..లేటెస్ట్ గా హిట్ 2 మూవీ లో విలన్ గా కూడా శబాష్ అనిపించుకున్నాడు..ఇప్పుడు ఆయన మరోసారి హీరో గా రైటర్ పద్మభూషణ్ అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు..కలర్ ఫోటో సినిమాలో హీరో గా నటించి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సుహాస్..ఈ సినిమా తో మరో హిట్ అందుకున్నాడా లేదా అనేది ఇప్పుడు చూడబోతున్నాము.
కథ :
పద్మ భూషణ్ విజయవాడ కి చెందిన కుర్రాడు..అతని తల్లి తండ్రులకు భూషణ్ ని పెద్ద రైటర్ ని చెయ్యాలనే కల ఉంటుంది..అందుకోసం నాలుగు లక్షలు ఖర్చు చేసి ‘తోలి అడుగు’ అనే పుస్తకాన్ని ప్రచురిస్తాడు..కానీ మార్కెట్ లో ఒక్క కాపీ కూడా సేల్ అవ్వదు..భూషణ్ సమీపం లో ఉన్న లైబ్రరీ లో పని చేస్తూ ఉంటాడు..అక్కడకి వచ్చే వాళ్ళు ఎలా అయినా తన పుస్తకాన్ని చదవాలనే తాపత్రయం తో అక్కడి పుస్తకాలలో తన పుస్తకాన్ని ఇరికిస్తాడు..పుస్తకం బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన తరవాత తానూ రచయితా గా తన తల్లితండ్రులతో కలిసి ప్రపంచానికి పరిచయం అవ్వాలని ఆశ పడుతూ ఉంటాడు..సరిగ్గా అదే సమయం లో రైటర్ పద్మభూషణ్ పేరు తో గుర్తు తెలియని వ్యక్తి ప్రచురించిన పుస్తకం అందుబాటులోకి వచ్చి పెద్ద సక్సెస్ అవుతుంది..దానిని పద్మభూషన్ (సుహాస్ ) రాసాడని భ్రమపడి మేనమామ లోకేంద్ర తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ముందుకు వస్తాడు..ఆ తర్వాత ఏమైంది..భూషణ్ పాపులర్ రైటర్ కాదని మేనమామ తెలుసుకున్నాడా..? భూషణ్ తో శారికా పెళ్లి జరిగిందా వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
సుహాస్ నుండి ప్రేక్షకులు పెద్దగా ఏమి ఆశించారు..డీసెంట్ కామెడీ ఉంటూ అలా టైం పాస్ అయిపోతే చాలు అంతే..రైటర్ పద్మభూషణ్ ప్రేక్షకులు ఆశించిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు అని చెప్పాలి..ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ తో నిండిపోయిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో ఆ ఫన్ మోతాదు కాస్త తగ్గింది అనే చెప్పొచ్చు..తాను పాపులర్ రచయితగా చలామణి అయ్యేందుకు సుహాస్ పడినపాట్లు కాస్త రొటీన్ గా అనిపించినా నవ్వు కలిగిస్తాయి..ఇంతకీ ‘రైటర్ పద్మభూషణ్’ పేరు తో ఆ పుస్తకాన్ని ప్రచురించిన వ్యక్తి ఎవరు అనే సస్పెన్స్ ని మాత్రం డైరెక్టర్ బాగానే క్యారీ చేసాడు.

ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ లో ముందుగా సుహాస్ గురించే మనం మాట్లాడుకోవాలి..ఇందులో అతని కామెడీ టైమింగ్ అద్భుతం..పాత్ర తాలూకు ప్రతీ ఎమోషన్ ని చాలా చక్కగా చూపించాడు సుహాస్..చివర్లో ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా సుహాస్ లో ఇంత పరిణీతి ఉందా అని అనిపించే రేంజ్ లో నటించాడు..ఇక హీరోయిన్ గా నటించిన టీనా శిల్పారాజ్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో నటించింది..కానీ సుహాన్ , టీనా మధ్య కెమిస్ట్రీ సరిగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది..ఇక ఆశిష్ విద్యార్థి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి..చాలా కాలం తర్వాత ఆయనకీ ఒక గొప్ప పాత్ర పడింది..ఇది వరకు ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యకపొయ్యేసరికి వెండితెర మీద చూసేటప్పుడు చాలా ఫ్రెష్ అనుభవం కలుగుతుంది..నటి రోహిణి పాత కూడా ఈ కథ కి ఎంతో కీలకం..మిగిలిన నటీనటులు కూడా పరిధిమేర బాగానే నటించారు.
చివరి మాట : ఈ వీకెండ్ ప్రేక్షకులకు చాలా చక్కటి సినిమా అనే చెప్పొచ్చు..కాసేపు టైంపాస్ చేద్దాం అని థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది.
రేటింగ్ : 2.75/5