
WPL : ఇండియాలో ఈ ఏడాది నుంచి ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్ మహిళ క్రికెట్ లో సరికొత్త ప్రపంచానికి నాంది పలుకుతోంది. మొదటి సీజన్లో అదరగొట్టి క్రికెట్ అభిమానుల మనసును చురగొంది ఈ లీగ్. క్రికెట్ అభిమానులను అలరించడంతోపాటు ఎంతో మంది యువ మహిళా క్రికెటర్లకు గొప్ప అవకాశంగా ఈ లీగ్ నిలుస్తోంది. మొదటి సీజన్ విజయవంతం కావడంతో దేశీయంగా ఉన్న ఎంతో మంది ప్రతిభ అంతర్జాతీయ స్థాయికి తెలిసింది. తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ లీగ్ ఎంతగానో దోహద పడిందని పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు. ఆయా క్రీడాకారుల ఏమన్నారో తెలుసుకుందాము.
నైపుణ్యం మెరుగుకు..
UP వారియర్జ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అంజలి శర్వాణి డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ టీమ్ తరపున అరంగేట్రం చేసింది. గత నెలలో T20 ప్రపంచ కప్ జట్టులో కూడా ఆడింది. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో బౌలింగ్ కోచ్ ఇచ్చిన సలహాలు, సూచనలతో నైపుణ్యాన్ని మరింత సాన బెట్టుకొగలిగింది. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ
“యాష్ [యాష్లే నోఫ్కే] నా బౌలింగ్ యాక్షన్ గురించి నాకు మంచి చిట్కా చెప్పారు. ఇది ఒక గేమ్‌లో భారీ మార్పును తెచ్చి పెట్టింది” అని శర్వాణి తాజాగా వెల్లడించింది. “డబ్ల్యూపీఎల్ నా కొత్త వెర్షన్‌కి సోపానం. ప్రపంచ కప్‌లో నాకు అవకాశం రాలేదు. భారత జట్టులో చేరేందుకు అవసరమైన నైపుణ్యాలు సాధించేందుకు, మరిన్ని అవకాశాలను పొందేందుకు ఇది గొప్ప అవకాశం” అని శర్వాణి వెల్లడించారు.
ఫీల్డ్ చెక్ చేసుకునే..
ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్ అయిన ఇరవై ఏళ్ల శ్రేయాంక పాటిల్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చే ముందు తన సొంత ఫీల్డ్‌లను సెట్ చేసుకునే స్వేచ్ఛ లేదు. “దేశీయ క్రికెట్‌లో, స్పిన్నర్లు తరచుగా వికెట్‌కు ఒకవైపు బౌలింగ్ చేయమని, బంతిని ఎగరవేయమని చెబుతారు. పేస్ లేనందున షార్ట్ థర్డ్ లేదా షార్ట్ ఫైన్ అనే భావన ఎక్కువగా ఉండదు” అని ఆమె చెప్పింది. “నేను ఆ నియమాన్ని సవాలు చేయడానికి ప్రయత్నించాను. నా కోచ్‌ల నుంచి మద్దతు లభించింది. కాబట్టి నేను RCB క్యాంపులో చేరినప్పుడు, శిక్షణ, ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఈ విధానాన్ని అమలు చేసినప్పుడు కోచ్‌లు సంతోషించారు. [మైక్] హెస్సన్ సార్ నేను ఫీల్డ్ సెట్ చేసుకునేందుకు అనుగుణంగా సిద్ధం అయినట్టు ప్రాక్టీస్ అనంతరం చెప్పాడు” అని పాటిల్ వెల్లడించింది. అలాగే, కాశ్మీర్ కు చెందిన 34 ఏళ్ల జసియా అక్తర్ దేశీయ క్రికెట్ లో సీనియర్ ప్లేయర్. ఢిల్లీ క్యాపిటల్స్ లో సభ్యురాలు అయినప్పటికీ ఒక్క గేమ్ కూడా ఆడలేదు. కానీ, టీమ్ సభ్యురాలు మెగ్ లానింగ్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం వల్ల అనేక విషయాలు తెలుసుకున్నట్లు వెల్లడించింది. విజయం, వైఫల్యం గురించి ఆమె దృక్పథాన్ని విని కళ్లు తెరుచుకున్నానని, అనుభవ పూర్వకంగా అనేక విషయాలను వెల్లడించారని తెలిపింది.
టోర్నమెంట్ లో వెలుగులోకి..
మొదటి మహిళా ప్రీమియర్ లీగ్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ముంబై ఇండియన్స్‌కు చెందిన సైకా ఇషాక్ గుర్తింపు పొందారు. ఈ టోర్నమెంట్ కు ముందు ఎవరో కూడా తెలియదు. టోర్నమెంట్ తరువాత మంచి గుర్తిపు పొందింది. దాదాపు ఒక దశాబ్దం పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న గుర్తింపు రాలేదు. 27 ఏళ్ల వయస్సులో, భారతదేశం తరపున ఆడాలనే ఆశ చాలా దూరం అనిపించిందనీ, అయితే ప్రపంచ వేదికపై క్రమ శిక్షణ, ధైర్యంతో కూడిన బౌలింగ్ తో లానింగ్, సోఫీ డివైన్, అలిస్సా హీలీ, తహ్లియా మెక్‌గ్రాత్, జెమిమా రోడ్రిగ్స్‌ల వికెట్లు పడగొట్టిన తర్వాత తనలో దైర్యం పెరిగిందని, ఇండియాకు ఆడే సామర్ధ్యం తనలో ఉన్నట్టు అర్థం అయిందని ఆమె పేర్కొంది.
ఆ మాట గొప్ప అనుభూతిని కల్పించింది..
యుపికి చెందిన పార్షవి చోప్రా అండర్-19 ప్రపంచ కప్ ఛాంపియన్. కానీ, అంతర్జాతీయ స్థాయి స్పిన్నర్లతో సమానంగా మొదటి టోర్నమెంట్ లో సత్తా చాటింది. 2023 మహిళల T20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిన ఆష్లీ గార్డనర్‌ను ఆమె అవుట్ చేయడం ఈ టోర్నీలో గొప్పదిగా చెప్పవచ్చు. మహిళల T20 లో టాప్ ర్యాంక్ బౌలర్ అయిన సోఫీ ఎక్లెస్టోన్ చోప్రా గురించి చెబుతూ.. చోప్రా గేమ్ ఛేంజర్ అని, గుర్తించదగిన ప్లేయర్ అని చెప్పడం అంటే ఆమెలోని సత్తా ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇది తనకు గొప్ప దిక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చోప్రా ఆనందాన్ని వ్యక్తం చేశారు.
మెళకువలు నేర్చుకున్నా..
ముంబైకి చెందిన 21 ఏళ్ల సిమ్రాన్ షేక్ మొదటి లీగ్ లో అనేక విషయాలు నేర్చుకున్నట్టు వెల్లడించింది. యుపి వారియోర్స్ తరపున ఆడుతున్నానని, తన ఫీల్డింగ్‌ను మెరుగుపరచుకోవడానికి కొత్త మెళుకువలు నేర్చుకున్నానని వెల్లడించింది. “నా ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడ్డాను. కోచ్‌లు చెప్పిన టెక్నిక్‌లను అమలు చేసాను. ఇంతకు ముందు చేయని పనులు చేయడంతో మంచి ఫలితం కనిపిస్తోందని ఆమె వెల్లడించింది. “సీనియర్‌లు, కోచ్‌లు బంతిని సరిగ్గా ఎలా విసరాలో చెప్పిన చిట్కాలు అక్కరకు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.
యువ భారత క్రికెటర్లను తయారు చేయడం..
ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్, UP కోచ్ జాన్ లూయిస్ మాట్లాడుతూ.. “ఇక్కడ నా పనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆటలో విజయం సాధించడం. మరొకటి యువ భారతీయ క్రికెటర్లను అభివృద్ధి చేయడం” అని అతను చెప్పాడు. “మేము 16 ఏళ్ల లెగ్ స్పిన్నర్ [చోప్రా], 18 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ [సొప్పదండి యశశ్రీ]ని అవుట్ చేయగలుగుతున్నాము అనే విషయం జరుపుకోవాలి. ఈ పోటీ అంతా యువ భారతీయ క్రికెటర్లను ఎదిగే అవకాశంకల్పించడంతో అనుభం అందించడం అని ఆయన పేర్కొన్నారు.