https://oktelugu.com/

WPL 2024 Final : గెలిస్తే ఒక బాధ.. ఓడిపోతే మరో బాధ.. పాపం బెంగళూరు అమ్మాయిలు

ఫైనల్ చేరడంతో బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెంగళూరు అభిమానులు ఈసాలా కప్ నమదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచినా లేదా ఫైనల్ పోరులో ఓడిపోయిన విమర్శలు తప్పవు.

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2024 9:55 pm
    wpl-2024-final-who-will-win-spor

    wpl-2024-final-who-will-win-spor

    Follow us on

    WPL 2024 Final : గత ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఐదు జట్లు పాల్గొన్న ఆ టోర్నీలో.. ఆ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది. స్మృతి మందాన, ఎలిస్ ఫెర్రీ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ జట్టు దారుణమైన ఆటతీరు ప్రదర్శించి అభిమానుల అంచనాలను తారుమారు చేసింది. అయినప్పటికీ ఈ సీజన్లో అభిమానులు ఆ జట్టుకు అండగా నిలిచారు. వారు చేసిన పూజలు ఫలించాయేమో.. బెంగళూరు జట్టు ఫైనల్ చేరుకుంది.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబైపై విజయం సాధించింది. ఐదు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ బెంగళూరు ఫైనల్ చేరినప్పటికీ.. ఆ జట్టుపై విమర్శలు తప్పేలా లేవు.

    ఫైనల్ చేరడంతో బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బెంగళూరు అభిమానులు ఈసాలా కప్ నమదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే బెంగళూరు జట్టు ఛాంపియన్ గా నిలిచినా లేదా ఫైనల్ పోరులో ఓడిపోయిన విమర్శలు తప్పవు. ఎందుకంటే ఒకవేళ ఫైనల్ లో బెంగళూరు జట్టు గెలిస్తే అమ్మాయిలు ట్రోఫీ సాధించారు.. అబ్బాయిలకు చేతకాదని విమర్శలు చేస్తారు. అదే ఒకవేళ ఓడిపోతే బెంగళూరు జట్టుకు ఏదీ చేతకాదంటూ గేలి చేస్తారు. సో ఎలా ఉన్నప్పటికీ బెంగళూరు జట్టుకు ఇబ్బందులు తప్పేలా లేవు.

    అయితే ఈసారి తమ జట్టు ఎలాగైనా కప్ కొట్టాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు. అమ్మాయిలు కప్ కొడితే.. అది అబ్బాయిల జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెబుతున్నారు. గెలవలేరు అనే ముద్రను చేరిపివేయాలంటే.. కప్ సాధించాలని బెంగళూరు అభిమానులు కోరుతున్నారు. కెప్టెన్ స్మృతి మందాన నుంచి ఫెర్రీ వరకు ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ప్రతిభ చూడాలని కోరుకుంటున్నారు. కాగా, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చెట్టుతో బెంగళూరు జట్టు తలపడనుంది. ఫైనల్ పై అభిమానులకు మరింత ఆసక్తి కలిగించేందుకు ఢిల్లీ, బెంగళూరు కెప్టెన్లు మెగ్ లాన్నింగ్, స్మృతి మందన్నా తో ఫోటోషూట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.