WPL 2024 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన ఎనిమిది లీగ్ మ్యాచ్ లలో ఆరు గెలిచి.. పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఢిల్లీ జట్టు. ఏకంగా ఫైనల్ దూసుకెళ్లింది. కానీ ఆదివారం బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ తడబడింది. టాస్ గెలిచిన ఆ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టు కెప్టెన్ లానింగ్(23), షఫాలీ వర్మ(44) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెంగళూరు బౌలర్ మొలినెక్స్ అద్భుతం చేసింది. ఏడవ ఓవర్లో ఒకటి, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా మూడు వికెట్లు తీసింది. షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, క్యాప్సి వికెట్లను తీసింది. దీంతో ఢిల్లీ జట్టు 64 పరుగులకు మూడు కీలక వికెట్లు పోగొట్టుకుంది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్స్(23) కూడా ఒత్తిడిలో అవుట్ అయింది. శ్రే యాంక బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయింది.
ఇక అప్పటినుంచి ఢిల్లీ కోలుకోలేదు. వరుసగా వికెట్లు కోల్పోయింది. కాప్, జోనాసెన్, రాధా యాదవ్, మిన్ను మణి, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, తానియా భాటియా.. ఇలా కీలక ఆటగాళ్లు మొత్తం వెంట వెంటనే అవుట్ అయ్యారు. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ 18.3 ఓవర్లకు 113 పరుగుల వద్ద ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో కనీసం పూర్తిస్థాయి ఓవర్లు కూడా ఆడలేదంటే ఢిల్లీ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బెంగళూరు బౌలర్లలో మొలినెక్స్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి మ్యాచ్ తీసింది. మ్యాచ్ ను బెంగళూరు వైపు తిప్పింది.. శ్రేయాంక కూడా నాలుగు వికెట్లు పడగొట్టి బెంగళూరు జుట్టుకు బూస్టప్ ఇచ్చింది. శోభన రెండు వికెట్లు సాధించింది. చివరి ఆరు వికెట్లను ఢిల్లీ జట్టు 39 పరుగుల వ్యవధిలో కోల్పోవడం విశేషం. ప్రస్తుతం బెంగళూరు జట్టు ఎదుట 114 పరుగుల విజయ లక్ష్యం ఉంది. మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.
Innings Break!
A sensational bowling display from @RCBTweets!
4⃣ wickets for @shreyanka_patil
3⃣ wickets for Sophie Molineux
2⃣ wickets for Asha ShobanaCan @DelhiCapitals bounce back?
Stay Tuned ⌛️
Scorecard ▶https://t.co/g011cfzcFp#TATAWPL | #DCvRCB | #Final pic.twitter.com/xl1YFMHVHA
— Women's Premier League (WPL) (@wplt20) March 17, 2024