Jal Jeevan Mission : ఆంధ్రాలో ఇంటింటికీ కుళాయి పధకం ఎందుకు నత్త నడక నడుస్తుంది?

తెలంగాణతోపాటు హిందీ రాష్ట్రాల్లో ఈ ఇంటింటికి కుళాయి పూర్తయ్యింది. ఆంధ్రాలో ఇంటింటికీ కుళాయి పధకం ఎందుకు నత్త నడక నడుస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : September 7, 2023 4:45 pm

Jal Jeevan Mission : జలజీవన్ మిషన్ 2019 ఆగస్టు 15 ఎర్రకోట నుంచి మోడీ దీనికి ఒక వాగ్ధానం చేశాడు. రెండోసారి ఎన్నికైన సందర్భంగా వచ్చే 5 ఏళ్లలో ప్రతీ ఇంటికి కుళాయి నీటి సౌకర్యం ఇస్తానని వాగ్ధానం చేశాడు. 2014లో వచ్చినప్పుడు ఆయన ప్రసంగిస్తూ మొట్టమొదటి సారి టాయిలెట్ల గురించి మాట్లాడాడు. స్వచ్ఛభారత్ కావాలి. మహిళల ఆత్మగౌరవం నిలబడాలంటే ప్రతీ ఇంటికి టాయిలెట్ కావాలి. అదే నా మిషన్ అని ప్రకటించాడు.

ఆ తర్వాత ఉజ్వల గ్యాస్ పథకం కింద 9.5 కోట్ల మందికి ఉచిత గ్యాస్ పథకం ఇచ్చారు. సబ్సిడీపై అందరికీ ఇప్పటికీ గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ ఇంటింటికి కుళాయి పథకం సౌకర్యం ఇస్తానని 2024లోపు పూర్తి చేస్తామని ప్రకటించారు.

ఇది కూడా మహిళలకు ప్రాధాన్యతనిచ్చింది. 2019లో మోడీకి అధిక ఓట్లు రావడానికి ఈ పథకాలే కారణం. జల్ జీవన్ పథకం కూడా వచ్చే 2024లో మహిళల నుంచి మోడీకి అత్యధిక ఓట్లు రావడానికి ఈ పథకం కూడా కారణం అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రాముఖ్యత జనాలకు అర్థం కాకపోవచ్చు. ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో నీటి కోసం మైళ్లకు మైళ్లు మహిళలు నెత్తిన కుండలతో వెళుతున్న దృశ్యాలు చాలా కామన్. కాబట్టి ఈ జల్ జీవన్ పథకం హిందీ రాష్ట్రాల్లో మోడీకి ఎంతో పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీనివల్ల టైం సేవ్ అవుతోంది. ఆరోగ్యకరమైన మంచి నీరు అందుతోంది. సగం ఆరోగ్యానికి దెబ్బతినడానికి కారణం తాగునీరే. అందుకే మోడీ మిషన్ చేపట్టారు.

తెలంగాణతోపాటు హిందీ రాష్ట్రాల్లో ఈ ఇంటింటికి కుళాయి పూర్తయ్యింది. ఆంధ్రాలో ఇంటింటికీ కుళాయి పధకం ఎందుకు నత్త నడక నడుస్తుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.