https://oktelugu.com/

Nara Brahmani- NTR: నారా బ్రాహ్మణి తో.. జూనియర్ ఎన్టీఆర్ కు చెక్

బ్రాహ్మణి విద్యాధికురాలు. మంచి వాగ్దాటి కలిగిన మహిళ కూడా. చంద్రబాబు అరెస్టు మొదలు ఆమె మాట్లాడుతున్న తీరు, సమయస్ఫూర్తి చూసి తెలుగుదేశం సీనియర్లు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2023 / 09:51 AM IST

    Nara Brahmani- NTR

    Follow us on

    Nara Brahmani- NTR: నారా బ్రాహ్మణి ఫుల్ టైం రాజకీయాల్లో అడుగుపెడుతున్నారా? టిడిపి పగ్గాలు ఆమెకేనా? చంద్రబాబు జైలు నుంచి బయటపడినా బ్రాహ్మణి సేవలు కొనసాగించనున్నారా? తద్వారా జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెట్టనున్నారా? ఇక నందమూరి వారి ప్రమేయం లేకుండా చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారా?అందుకే బాలకృష్ణను కాదని బ్రాహ్మణిని ఎంచుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ మొదలు బ్రాహ్మణి రాజమండ్రి లోనే ఉన్నారు. హెరిటేజ్ వ్యాపార కార్యకలాపాలను సైతం విడిచిపెట్టి రాజమండ్రి వేదికగా అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.మీడియాతో మాట్లాడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు.ఈ పరిణామాలన్నీ చూస్తుంటే టిడిపి పగ్గాలు ఆమెకేనని తెలుస్తోంది.

    బ్రాహ్మణి విద్యాధికురాలు. మంచి వాగ్దాటి కలిగిన మహిళ కూడా. చంద్రబాబు అరెస్టు మొదలు ఆమె మాట్లాడుతున్న తీరు, సమయస్ఫూర్తి చూసి తెలుగుదేశం సీనియర్లు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు. బ్రాహ్మణి, భువనేశ్వరిలను ముందు పెట్టి చంద్రబాబు అరెస్టు విషయంలో జరుగుతున్న కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు పవన్ సెంటర్ అట్రాక్షన్గా మిగులుతారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణి సమకాలిన రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారని.. ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాబిన్ శర్మ టీం రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం బ్రాహ్మణి రాజకీయాలు అవపోషణ పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు కేసులు నుంచి బయటపడినా నారా బ్రాహ్మణిని తురుపుముక్కగా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

    జూనియర్ ఎన్టీఆర్ కి చెక్ చెప్పాలంటే.. బ్రాహ్మణియే కరెక్ట్ అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ క్లిష్ట సమయంలో సైతం జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. చంద్రబాబు జైలుకి వెళ్లి దాదాపు నెలరోజులు కావస్తున్నా తారక్ నుంచి ఉలుకూ పలుకూ లేదు. కనీసం సోషల్ మీడియానైనా స్పందించలేదు. దీంతో నందమూరి, నారా కుటుంబ సభ్యుల్లోతారక్ పై ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. తారక్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిన సందర్భంలో చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించిన విషయాన్ని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. అటువంటి చంద్రబాబు జైల్లో ఉంటే కనీసం స్పందించకపోవడం ఏమిటని తారక్ను టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే చంద్రబాబు ఈ స్థితికి తారక్ కారణమని.. వైసిపి, బిజెపి లతో కలిసి కుట్ర చేశారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.అటువంటి వ్యక్తికి చెక్ చెప్పాలంటే నందమూరి బిడ్డ అయినా బ్రాహ్మణికి టిడిపి పగ్గాలు అప్పగిస్తే మంచిదన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.

    భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తన చేతుల్లోకి వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వైసిపి నేతలు సైతం పార్టీని తారక్ చేతుల్లోకి తీసుకోవాలని సూచిస్తుండేవారు. చంద్రబాబు ప్రత్యర్థులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండేవారు. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి ఆహ్వానిస్తే మంచి మైలేజ్ వస్తుందని అభిప్రాయపడేవారు. లోకేష్ ఎదుగుదలకు తారక్ అడ్డంగా మారుతాడని చంద్రబాబు ఆయనను దూరం పెట్టారని విమర్శలు వచ్చాయి.కానీ చంద్రబాబు అరెస్టు తరువాత తారక్ స్పందించకపోవడంతో.. ఆయనపై మునుపటిలా టిడిపి శ్రేణులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.సరిగ్గా ఇటువంటి సమయంలోనే బ్రాహ్మణిని రంగంలోకి దించితే.. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఉండదన్న అభిప్రాయం టిడిపి సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. అందుకే బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు తెర వెనుక జరుగుతున్నట్లు సమాచారం.