Wiral Video: జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటిని ఓపిక కొద్ది పరిష్కరించుకునేవారు కొందరైతే.. తెలివితో సొల్యూషన్ వెతుక్కునేవారు ఇంకొందరు ఉంటారు. అయితే కొందరు తమ సౌకర్యాల కోసం చేసే ప్రయోగాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. వారికి వచ్చే ఐడియాలను చూస్తే ఇంత టాలెంట్ ఎక్కడిది వీడికి? అనేంతలా అనిపిస్తుంది. లేటేస్టుగా ఓ ఆటోరిక్షావాల చేసిన ప్రయోగం పలువురిని ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా ఓ ఉపాయం ద్వారా తనకున్న అసౌకర్యాన్ని పరిష్కరించుకోగలిగాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వీక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ నగరంలో రోడ్డుపై ట్రాఫిక్ జాం అయింది. దీంతో ఓ ఆటో ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోతుంది. ఇందులో ఓ ఆటోకు పెద్ద పైపును అమర్చి ఉంది. బయటకు లోపలికి ఉండే విధంగా దీనిని సెట్ చేశాడు. అయితే దీనిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ పైపు ను ఆయన ఎందుకు అమర్చాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఆయన చెప్పిన విషయం చూసి షాక్ అయ్యారు.
కార్లలో ప్రయాణించేవారికి ఏసీ సౌకర్యం ఉంటుంది. కానీ ఆటో నడిపే వారికి అలాంటిదేదీ ఉండదు. వేసవి కాలంలో అయితే మండుటెండల్లో ప్రయాణించాల్సిందే. ఈసమయంలో ఉక్కపోతతో భరించరాకుండా ఉంటుంది.ఈ పరిస్థితిని తీవ్రంగాఎదుర్కొన్న ఓ ఆటోవాలా తన ముఖానికి గాలి రావడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. దీంతో తనకువచ్చిన ఐడియాతో తనకున్న అసౌకర్యాన్ని పరిష్కరించుకోగలిగాడు.
రెండు పైపులను తీసుకొని బయట నుంచి లోపలికి ఉండే విధంగా ఆటోకు ఉండే మిర్రర్ స్థానంలో అమర్చాడు. ఇలా సెట్ చేయడం వల్లఆటో ప్రయాణించినప్పుడు బయటి గాలి పైపు ద్వారా నేరుగా ఆటో డ్రైవర్ ముఖంపై పడుతుంది. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈఆటో డ్రైవర్ చేసిన పనికి అందరూ ఆశ్చర్యంగా చర్చించుకోవడమే కాకుండా అభినందిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ‘ఎవడ్రా వీడు.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు’ అని కామెంట్ పెడుతున్నారు.