Tamil film industry : మహానటి సినిమాలో ఒక డైలాగ్ ఉంది అది ఏమిటి అంటే తెలుగు ఇండస్ట్రీ నా పుట్టినిల్లు అయితే తమిళ ఇండస్ట్రీ మెట్టినిల్లు అని. మహానటి సినిమాలో సావిత్రి విషయంలోనే కాదు తెలుగు సినిమా ప్రేక్షకుల అందరి విషయంలో ఇది వర్తిస్తుంది. ఎందుకంటే తెలుగు సినీ ప్రేక్షకులు తమిళ ఇండస్ట్రీని తమ సొంత ఇండస్ట్రీ గానే భావిస్తారు. తమిళ సినిమాలకు కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు సినిమాలకు సమానంగా క్రేజ్ ఉంటుంది. అంతేకాదు తమిళ హీరోలని మన సొంత హీరోలలనే చూసుకుంటూ ఉంటాము.
అయితే అలాంటి తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు పెట్టిన కొన్ని కండిషన్లు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కొత్త నిబంధనలను తమ తమిళ ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చాయి. అందులోని ముఖ్యమైన పాయింట్లు ఏమిటి అంటే తమిళ సినిమాల్లో తమిళ నటీనటులు మాత్రమే పనిచేయాలి అని అలానే సినిమా షూటింగులు కేవలం తమిళనాడులోనే జరగాలి అని. ఇక దీనిపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుంది.
నిజంగా అసలు తమిళ ఇండస్ట్రీ వారు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఎవరు అంటే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే రజినీకాంత్ అని చెప్పేస్తాం. అంతేకాకుండా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమానులు ఉన్న హీరో ఎవరు అంటే అజిత్ పేరు వినిపిస్తుంది. అయితే వీరిద్దరూ తమిళవారు కాకపోవడం విశేషం. రజినీకాంత్ మైసూర్ కి చెందిన వారైతే అజిత్ కేరళ కి చెందినవారు.
ఇక హీరోయిన్స్ లో కూడా తమిళ ఇండస్ట్రీని ఒకప్పుడు ఏలిన కుష్బూ మహారాష్ట్ర కి చెందిన వారైతే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీని ఏలుతున్న నయనతార కర్ణాటక కి చెందిన అమ్మాయి. అంతెందుకు మణిరత్నం ఇంట్రడ్యూస్ చేసి తమిళ ప్రేక్షకుల దగ్గర ఎంతో ఆదరణ పొందిన ఐశ్వర్యారాయ్ కూడా తమిళ అమ్మాయి కాదు.
అయితే వీరందరూ తమిళ ఇండస్ట్రీలో సునామీ సృష్టించిన వారు. ముఖ్యంగా రజినీకాంత్ తమిళ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాడు. చైనాలో కూడా తమిళ సినిమా అంటే ఏమిటో రుజువు చేసిన హీరో రజనీకాంత్. ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక అజిత్ కి కూడా తక్కువేమీ కాదు. ప్రపంచంలో నలుమూలల అజిత్ కి కూడా కావాల్సినంత అభిమానం ఉంది. మరి తమిళ వారిని మాత్రమే తమ ఇండస్ట్రీలో పెట్టుకోవాలి అనుకుంటే, ఇప్పుడు తమిళ సినిమా సంఘం వాళ్ళు రజినీకాంత్, అజిత్, నయనతార లాంటి వారిని బహిష్కరిస్తారా అని ప్రశ్న. అయితే అలా చేస్తే అక్కడ తమిళ ప్రేక్షకులే వారి నిర్ణయాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే 50% కన్నా ఎక్కువ అక్కడ వీరి ముగ్గురి అభిమానులే ఉంటారు.
అయినా ప్రస్తుతం ప్రతి భాష మన భాష సినిమా ప్రపంచమంతా గుర్తింపు పొందాలి అని అనుకుంటూ ఉంటే.. తమిళ వారు మాత్రం తమ స్థాయిని తగ్గించుకోవాలి అని ఎందుకు చూస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదు. మరి తమిళ ఇండస్ట్రీ వారు ఈ వైఖరిని మార్చుకుంటారో లేదో చూద్దాం.