Pawan Kalyan ‘‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా’’ ఈ ఫేమస్ సూపర్ హిట్ సినిమా డైలాగ్ ఇదిప్పుడు పొలిటికల్ తెరపై పేలుతోంది. సినిమాల్లో వేషం కోసం ఆర్టిస్టులు రిక్వెస్ట్ చేస్తే.. ఇప్పుడు అధికారం కోసం రాజకీయ నాయకులు రిక్వెస్ట్ చేయడం సాధారణంగా మారింది. ప్లీజ్.. ప్లీజ్.. ప్లీజ్ అంటూ మైకులు పగిలిపోయే రేంజ్‌లో రిక్వెస్టు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
. సినిమాల్లో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న పవన్ కల్యాణ్ రాజకీయంగానూ తన సత్తా చూపించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీచేసి ఓడినా.. ఆయన రాజకీయాలను వదల్లేదు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. అధికార పక్షంతో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఇప్పుడు మరోమారు రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల విజయనగరం జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు.. పొలిటికల్ కారిడార్‌లో వన్ ఛాన్స్ ప్లీజ్ అనే డైలాగ్‌ను మరోసారి తెరమీదకు తీసుకొచ్చాయి. అధికారంలోకి రావడానికి ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో, నా పరిపాలనా విధానం ఏంటో చూపిస్తాం అంటూ పవన్ అభ్యర్థించడం పొలిటికల్‌గా మరోసారి చర్చకు దారి తీసింది. ‘‘ఉత్తరాంధ్ర మీద ఒట్టు మీ భవిష్యత్తుకు నాది భరోసా’’ అంటున్నారు. విద్యనేర్పి.. సినిమా జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు సేవచేసే భాగ్యం కలిగించాలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. అది ఎంత వరకు ఫలితాన్నిస్తుందో తెలియదు. కాకపోతే, గతానుభవాల దృష్ట్యా ఈ డైలాగ్ పవర్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వన్ ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేసిన పొలిటికల్ ఘటనలు లేకపోలేదు.
పవన్ కళ్యాణ్ ‘ఒక్క ఛాన్స్’ స్లోగన్ పై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
