KCR : కేసీఆర్ ఓడిపోయారు… ఎందుకు?

మేం ఎవరికి అనుకూలం కాదు(విద్యార్థులకు తప్ప) , వ్యతిరేకులము కాదు....మాకు పార్టీ లేదు. జెండాలేదు, అజెండా లేదు. ఉన్నదల్లా ఆత్మాభిమానం, వివేకమే.

Written By: NARESH, Updated On : December 4, 2023 4:18 pm
Follow us on

KCR -Telangana Elections 2023 : పట్టమెలే రాజు పోయెను….మట్టి కలిసెను కోట పేటలు…పదం పద్యం పట్టి నిలిచెను…కీర్తులపకీర్తుల్
కేసీఆర్ ఓడిపోయారు . ఎందుకు?

పది సంవత్సరాలనుంచి టీచర్లకు నల్ల రిబ్బన్ లు అమ్మిన షాప్ ఓనర్నడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు.
* పది సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ దినోత్సవంరోజున రవీంద్రభారతి స్టేజ్ పై ఖాళీగా ఉన్న కుర్చీని అడుగు నువ్వు ఎందుకు ఒడిపోయావో చెబుతుంది.
*ఉపాధ్యాయులను గౌరవించనవసరం లేదని మీకు నేర్పిన, మీరుచదివిన డెబ్బైవేల పుస్తకాలనడుగు నువ్వెందుకు ఓడిపొయావో చెబుతాయి.
*ఈ పదేళ్లు మీ అప్పాయింట్మెట్ కోసం గంటలు గంటలు ప్రగతిభవన్ గేటు బయట నిల్చున్న “మా యూనియన్ నాయకుల ఆత్మగౌరవాన్ని” అడుగు నువ్వెందుకు ఓడిపోయావో చెబుతుంది.
* అందరిలాగా మాఅమ్మ, మా నాన్న ఇంటినుంచి బడికి పోకుండా వేరే జిల్లా బడులకు ఎందుకు పోతున్నారో అర్థం కాక బాల్యం బలైపోయిన 317బాధితుల పిల్లలనడుగు నువ్వెందుకు ఒడిపోయావో చెబుతారు.
* లోకల్ లను నాన్ లోకల్ లుగా మార్చిన మీ అనుంగు అధికారుల తెలివితేటలనడుగు నువ్వెందుకు ఒడిపోయావో చెబుతాయి.
*S.T.O కార్యాలయాల్లో చెదలు పడుతున్న ఉపాధ్యాయుల బిల్లులనడుగు నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాయి.
*CBIL స్కోర్ తగ్గిపోయిన ఉద్యోగుల వివరాలను తెలిపే బ్యాంకు మేనేజర్నడుగు. నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు
*త్వరలో ఉపాధ్యాయుల ప్రమోషన్ లు బదిలీలు అని తరచుగా రాసే పత్రికాధిపతులనడుగు. నువ్వు ఎందుకు ఓడిపోయావో చెబుతాడు
*’ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు’ అని అచ్చును సిద్దంగా ఉంచుకున్న విలేకరులను అడుగు. మీరెందుకు ఓడిపోయారు వివరంగా చెబుతారు. మేం ఎవరికి అనుకూలం కాదు(విద్యార్థులకు తప్ప) , వ్యతిరేకులము కాదు….మాకు పార్టీ లేదు. జెండాలేదు, అజెండా లేదు. ఉన్నదల్లా ఆత్మాభిమానం, వివేకమే.

*యత్ర్య ఆచార్య పూజ్యతే తత్ర్య రమంత దేవతా*
అంతా అనుకున్నట్టే అయింది
అహంకారం అహంభావం
నియంతృత్వం నిస్సిగ్గు
తుడిచిపెట్టుక పోయింది
నోటికి వచ్చిన మాటలతోనే
ఈరోజు నోటికి మూత పడింది
జీతం అడిగితే జీతగాల్లలెక్క
భత్యేం అడిగితే బానిసలెక్క
హక్కులు అడిగితే హౌలాలెక్క
చూసిన మీ మదం
ఒక్క ఓటు పోటుతో చెరిగిపోయింది
317 తో పుట్టకొకరు చెట్టుకొకరుగా
అమాంతంగా విసిరేశారు
ఏడ్చినా చచ్చినా ధర్నా చేసినా
దయ చూపలేదు
ఆ కసి ఈరోజు కాటు వేసింది
పీఆర్సీ పేరిట కోత కోసిన
33 నెలల బకాయి
డీఏ ల మాటున నొక్కిన
లెక్కలేనన్ని విడతలు
ఈ విడత నిన్ను లేకుండా చేసింది
బంధు అంటూ సాగించిన నాటకం
రక్తి కట్టించలేదు
ఎత్తులు పై ఎత్తులు వేస్తే
అధికారం నిలవదు
నీ కాలు భూమి మీద నిలవాలి
ఎక్కడ నుండి అయినా
పాలన చేస్తా నేను దొరను
అంటే చెల్లదు అని తీర్పు వచ్చింది
అడిగిన వాడిని ద్రోహి అని
అధికారంతో మీరు వేసిన ముద్ర
నేడు తుడిచి పెట్టుకు పోయింది
మాది బరాబర్ కుటుంబ పాలనే
ఇంగ్లీష్ వస్తె చాలు గొప్ప
అన్న మీ పలుకులు
తప్పు అని రుజువు అయ్యాయి
ధర్నా చౌక్ మా హక్కు
నిరసన మా డీఎన్ఏ
ప్రశ్నించడం మా అస్తిత్వం
ఉచితం లేకున్నా బతుకుతాం
కానీ బాంచెన్ అనం అని
రాష్ట్రం నేడు తెగించి చెప్పింది
మీడియా ను చేతిలో పెట్టుకుంటే
చాలని భావించారు
అది సమయం చూసి దెబ్బ కొట్టింది
బిడ్డ ఏం చేసినా ఒప్పంటే
చూస్తూ ఊరుకునే సమాజం కాదని
తెలంగాణ తెలివి చూపింది
అడ్డగోలుగా దోచిన సొమ్ముతో
ఓట్లు కొనే కుట్రకు గండి పడింది
ప్రాజెక్టుల పేరిట మీ దోపిడీ
ఈరోజు అధికారానికి
నిలువు దోపిడి చేసింది
పెద్ద అంటే పెద్దరికం ఉండాలి
మాట అంటే తేటగా ఉండాలి
పాలనలో ప్రజాస్వామ్యం ఉండాలి
ఇప్పటికైనా బుద్ది తెచ్చుకో
ప్రతిపక్షంలో పలక పట్రుకో
ప్రజల నడుమ ఇల్లు కట్టుకో
ఒంటరిగా దూరంగా జీవిస్తే
అదే ఒంటరితనం
అదే దూరపుతనమే మిగులుతుంది
ఓటరు ఎన్నడూ ఓడలేదు
నియంతృత్వం ఎన్నడూ నెగ్గలేధు
ఇది చరిత్ర
తెలంగాణలో మరో చరిత్ర

-జలంధర్ రెడ్డి