Biscuits Holes: మనం రోజూ తినే బిస్కెట్లకు అసలు రంధ్రాలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ సీక్రెట్ ఇదీ

బిస్కెట్లకు సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారు కదా.. మీరు తినే బిస్కెట్లకు రంద్రాలు ఉంటే.. కొన్నింటికి ఉండవు. స్టైల్ కోసమా? టేస్ట్ కోసమా? లేదా దేనికోసం రంద్రాలు చేస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా?

Written By: Suresh, Updated On : October 4, 2023 3:43 pm

Biscuits Holes

Follow us on

Biscuits Holes: ఉదయం లేవగానే టీ తాగే అలవాటు మీకు కూడా ఉందా? ఉదయం, సాయంత్రం ఓ కప్పు టీ పడితే గానీ మనుసు కుదటపడని వారెందరో.. ఇక టీ మాత్రమే కాదు టీ లోకి బిస్కెట్స్, బ్రెడ్ వంటివి కూడా ఇష్టపడుతారు చాలా మంది. టీ తాగడం వరకు బాగానే ఉంది. ఇంతకీ టీతో పాటు బిస్కెట్స్ ఎందుకు తింటున్నారు? అసలు ఈ బిస్కెట్ల గురించి ఏదైనా రహస్యం మీరు తెలుసుకున్నారా? అయితే ఆలస్యం ఎందుకు ఇప్పుడు తెలుసుకుందాం…

బిస్కెట్లకు సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారు కదా.. మీరు తినే బిస్కెట్లకు రంద్రాలు ఉంటే.. కొన్నింటికి ఉండవు. స్టైల్ కోసమా? టేస్ట్ కోసమా? లేదా దేనికోసం రంద్రాలు చేస్తారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? దానిక వెనక ఓ పెద్ద రహస్యమే ఉందండోయ్.. ఈ రంద్రాలను డిజైన్ కోసం వేశారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే.. కానీ, ఇది ఎంతమాత్రం కాదు. బిస్కెట్లలో చేసిన ఈ రంధ్రాలను డాకర్స్ అంటారు. బిస్కెట్లలో గాలి వెళ్లేందుకు ఈ రంద్రాలు ఉంటాయి. అన్ని వింతగా ఉన్నాయి కదా.. మనుషులకు కదా గాలి కావాలి? మళ్లీ ఈ బిస్కెట్లకు ఎందుకు అనుకుంటున్నారా?

బిస్కెట్లలో రంధ్రాలు చేయడానికి కారణం వాటి బేకింగ్‌కు సంబంధించినది. నిజానికి, బేకింగ్ సమయంలో, గాలి బిస్కెట్‌లోని రంధ్రాల ద్వారా సులభంగా వెళుతుంది. బిస్కెట్‌లో రంధ్రాలు చేయకపోతే, బేకింగ్ సమయంలో కొంత గాలి దానిలో నింపుతుంది. దీని వల్ల బిస్కెట్ ఆకారం కూడా చెడిపోతుంది. చాలా సార్లు, బిస్కెట్లను రంధ్రాలు చేయకుండా కాల్చేటప్పుడు, అవి ఎక్కువగా ఉబ్బినప్పుడు పగిలిపోతాయి. అందుకే బిస్కెట్లలో గాలి బయటకు వచ్చేలా రంధ్రాలు చేస్తారు.

మరి రంద్రాలు ఎందుకు చేస్తారు అనేది తెలుసుకున్నారు? బిస్కెట్ల తయారీ కూడా చదివేయండి. బిస్కెట్ల తయారీకి కావలసిన పదార్థాలను పిండి, పంచదార, మిక్స్ చేస్తారు. ఆ తరువాత ఈ పదార్థం అచ్చులో వేస్తారు. ఒక యంత్రం కింద ఉంచుతారు. అప్పుడు ఆ అత్యాధునిక యంత్రాలు సమాన దూరంలో రంధ్రాలు చేస్తాయి. అందుకే వీటిని డిజైన్ కోసమే తయారు చేశారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. రంధ్రాల కారణంగా, బిస్కెట్ చుట్టూ సమానంగా ఉబ్బుతుంది. అందువల్ల, ఆ బిస్కెట్ల బేకింగ్ కూడా చాలా సులభంగా మారుతుంది. తీపి, ఉప్పగా ఉండే బిస్కెట్లలో రంధ్రాలు ఉండటం వల్ల అవి క్రిస్పీగా ఉంటాయి. రంధ్రాల కారణంగా, ఈ బిస్కెట్లు సరిగ్గా ఉడికించినప్పుడు క్రంచీగా మారుతాయి. చూశారా.. బిస్కెట్లకు రంద్రాలు పెట్టడం వెనుక ఇంత పెద్ద రహస్యం ఉంది. మరి ఈ సారి మీరు టీ, బిస్కెట్ తినేటప్పుడు ఓసారి మీ బిస్కెట్స్ కు రంద్రం ఉందో లేదో పరీక్షగా చూసేయండి…