SRH – Pat Cummins : ప్యాట్ కమిన్స్ పై 20.5 కోట్లను సన్ రైజర్స్ ఎందుకు వెచ్చించింది..? అసలు కథేంటి..?

అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్యాట్ కమ్మిన్స్ కి కెప్టెన్సీ అప్పగిస్తారా లేదా అనే విషయం మీదనే ఇప్పుడు భారీ చర్చలు అయితే నడుస్తున్నాయి...

Written By: NARESH, Updated On : December 19, 2023 9:44 pm
Follow us on

SRH – Pat Cummins : 2024 ఐపీఎల్ కు సంబంధించిన సన్నాహాలన్నీ ఇప్పటినుంచే మొదలయ్యాయి. ఇక ఇవాళ్ల జరిగిన మిని ఆక్షన్ లో టీమ్ లు అన్ని కూడా వాళ్ల సామర్థ్యం మేరకు మంచి ప్లేయర్లను తీసుకునే ప్రయత్నం అయితే చేశాయి. ఇక అందులో భాగంగానే అందరికంటే మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిన టీం ఏదైనా ఉంది అంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అనే చెప్పాలి. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ టీమ్ ఎప్పుడూ కూడా మంచి ఫామ్ లో ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు.ఇక 2016 వ సంవత్సరంలో డేవిడ్ వార్నర్ నేతృత్వంలో ఆడిన సన్ రైజర్స్ టీమ్ ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తన సత్తాను చాటులేక పోతుంది.ప్రతి సీజన్ లో కూడా దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తుంది..

ముఖ్యంగా ఈ టీమ్ లో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే కెప్టెన్సీ సరిగ్గా చేయలేకపోవడం, ఎప్పుడైతే వార్నర్, విలియమ్ సన్ లను టీమ్ లో నుంచి పంపించేశారో ఇక అప్పటినుంచి ఈ టీం మరీ కష్టాల్లో పడిపోయింది. వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఎన్నో కొన్ని మ్యాచ్ లు అయిన గెలిపించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత ఈ టీమ్ కి కెప్టెన్లుగా వచ్చిన ఎవరూ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు…ఇక అందులో భాగంగానే ఈరోజు జరిగిన మినీ వేలం లో పాట్ కమ్మిన్స్ పైన ఫోకస్ చేసింది అందుకే భారీ మొత్తంలో అతని కోసం డబ్బులు ఖర్చు పెట్టి మరీ అతన్ని టీంలోకి తెచ్చుకుంది…

కమ్మిన్స్ ఆస్ట్రేలియా టీం కి వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్ గా వ్యవహరించడమే కాకుండా ఆ టీం కి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా కూడా ఒక హిస్టరీని క్రియేట్ చేశాడు. ఇక దాంతో ఇప్పుడు కమ్మిన్స్ ని హైదరాబాద్ టీం కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశ్యం తోనే అతనికి 20 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించి అతన్ని టీం లోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది…కెప్టెన్ గానే కాకుండా పాట్ కమ్మిన్స్ బౌలింగ్ లోను తన సత్తా చూపించగల కెపాసిటీ ఉన్న ప్లేయర్ కావడం కూడా టీమ్ కి ఒక వంతుకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.

ఇప్పటివరకు 50 మ్యాచ్ లు ఆడిన కమ్మిన్స్ 55 వికెట్లు తీశాడు. అలాగే ఐపిఎల్ లో గత అరు సీజన్ లలో కలిపి 45 వికెట్లు తీశాడు. గత సీజన్ లో ఐదు మ్యాచ్ లు ఆడిన ఆయన 7 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు…ఇక ఇప్పటికే కమ్మిన్స్ బౌలర్ గా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కి తనకి కెప్టెన్ గా అవకాశం ఇస్తే దాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయాలని ఉద్దేశ్యం లో అయితే అతను ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక మరి అన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్యాట్ కమ్మిన్స్ కి కెప్టెన్సీ అప్పగిస్తారా లేదా అనే విషయం మీదనే ఇప్పుడు భారీ చర్చలు అయితే నడుస్తున్నాయి…